Villiage Volunteer: పెళ్ళికి కొన్ని గంటలే.. ఆ మహిళా వాలంటీర్ ఏమి చేసిందంటే?
విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలానికి చెందిన నవ వధువు శుక్రవారం నాడు
ఏపీలోని వాలంటీర్ వ్యవస్థపై ప్రతి పక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే! కొందరు వైసీపీకి తొత్తులుగా పని చేస్తూ ఉన్నారంటూ టీడీపీ-జనసేన పార్టీ నేతలు ఎప్పటికప్పుడు దెప్పి పొడుస్తూనే ఉన్నారు. కానీ వాలంటీర్లు కొన్ని మంచి మంచి పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. తాజాగా ఓ అమ్మాయి ఇంకొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకుని కూడా వాలంటీర్ విధులను నిర్వర్తించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలానికి చెందిన నవ వధువు శుక్రవారం నాడు తన పెళ్లికి కొన్ని గంటల ముందు తన వాలంటీర్ విధులకు హాజరైంది. వధువు రోజా రాణి, మార్చి 1, 2024న హుకుంపేట మండలం పాటిగారుకు చెందిన గ్రామ వాలంటీర్ కిరణ్‌సాయిని వివాహం చేసుకుంది. ఆమె తన వివాహానికి కొన్ని గంటల ముందు ఉదయం తన ప్రాంతంలోని లబ్ధిదారులకు పింఛన్ డబ్బులను పంపిణీ చేసింది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ తో సహా ప్రతిపక్ష నేతలు ఆంధ్రప్రదేశ్‌లో ఈ వ్యవస్థపై విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ, తమ బాధ్యతలను విస్మరించకుండా వాలంటీర్లు తమ విధులను నిర్వర్తిస్తూ జనంలో మంచి పేరును తెచ్చుకుంటూ ఉన్నారు.