తిరుమల శ్రీవారి దర్శనార్థం, తిరుపతి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లాలో పలు రాష్ట్రాల గవర్నర్లు పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.

తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనార్థం, తిరుపతి(Tirupati) జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లాలో పలు రాష్ట్రాల గవర్నర్లు పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి(Collector Venkataramana Reddy) ఒక ప్రకటనలో తెలియజేశారు.

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్(Kerala Governor Arif Mohammed Khan) 11న ఉదయం 11:45 గం. లకు రేణిగుంట విమానాశ్రయం(Renigunta Airport) చేరుకుని తిరుపతి తాజ్ హోటల్(Taj Hotel) లో విశ్రాంతి తీసుకోని.. అనంతరం 3:30 కు తిరుమల చేరుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకుని సాయంత్రం 5.45 గం. ప్రాంతంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరిగి తిరుపతిలోని తాజ్ హోటల్ నందు రాత్రి బస చేయనున్నారు. 12న‌ ఉదయం 10 గం.ల నుండి 11 గం.ల వరకు తిరుపతి లోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ స్థానిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గం.లకు రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనం కానున్నారు.

అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా(Assam Governor Gulab Chand Kataria) 11న సాయంత్రం 4:30 గం. లకు తిరుమల, తిరుపతి పర్యటన కొరకు జిల్లాకు చేరుకుని రాత్రి బస చేస్తారు. 12న ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మధ్యాహ్నం 2 గం. నుండి 3.30 వరకు తిరుపతి లోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం మూడు రోజుల జాతీయ సంస్కృత కన్వెన్షన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని రాత్రి 8.20 గం కు రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనం కానున్నారు.

మేఘాలయ గవర్నర్ ఫగు చౌహాన్(Governor of Meghalaya Phagu Chauhan) 12న సాయంత్రం 4:00 గం లకు తిరుమల చేరుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకుని అక్కడే రాత్రి బస చేస్తారు. 13న ఉదయం మరొక మారు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మధ్యాహ్నం 2.30 గం. లకు రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనం కానున్నారు.

Updated On 10 July 2023 10:15 PM GMT
Yagnik

Yagnik

Next Story