Security To ACB Court Judge : చంద్రబాబు కేసు ఎఫెక్ట్.. ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి 4+1 ఎస్కార్ట్ తో భద్రత
ఏసీబీ కోర్టు(ACB Court) న్యాయమూర్తి జస్టిస్ హిమబిందుకు(Justice Hima Bindu) రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచింది. హిమబిందుకు 4+1 ఎస్కార్ట్(4+1 Escort) తో భద్రత కల్పించింది ఏపీ ప్రభుత్వం. చంద్రబాబు(Chandrababu) కేసు విచారణ దృష్ట్యా.. ఎలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా.. ఏపీ ప్రభుత్వం న్యాయమూర్తి హిమబిందుకు భద్రత పెంచినట్లు తెలుస్తోంది.

Security To ACB Court Judge

న్యాయమూర్తి హిమబిందు ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ కాగా.. ఆయనను 14 రోజుల రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్(House remand Petition) కూడా ఈ రోజు తిరస్కరణకు గురైంది. ఈ నేపథ్యంలోనే జస్టిస్ హిమబిందుకు ప్రభుత్వం భద్రత పెంచినట్టు తెలుస్తోంది.