Gorantla Madhav : జగన్ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
మునుపటి చంద్రబాబునాయుడు(Chandrababu) కాదాయన! ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. బహుశా తీవ్ర ఒత్తిడిలో ఉంటుంటారు. దానికి తోడు పెరుగుతున్న వయసు. చేయని పనులను కూడా తన ఖాతాలో వేసుకుని, తన గొప్పలను తానే చెప్పుకుంటే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని(Jagan Mohan Reddy) పనిగట్టుకుని తిడుతుంటారు. ఉమ్మడి అనంతపురం(Anantapur) జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు బహిరంగసభలో జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Gorantla Madhav
మునుపటి చంద్రబాబునాయుడు(Chandrababu) కాదాయన! ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. బహుశా తీవ్ర ఒత్తిడిలో ఉంటుంటారు. దానికి తోడు పెరుగుతున్న వయసు. చేయని పనులను కూడా తన ఖాతాలో వేసుకుని, తన గొప్పలను తానే చెప్పుకుంటే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని(Jagan Mohan Reddy) పనిగట్టుకుని తిడుతుంటారు. ఉమ్మడి అనంతపురం(Anantapur) జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు బహిరంగసభలో జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నీ పుట్టుకే తప్పుడు పుట్టుక అంటూ జగన్ ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కామెంట్లపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్(Gorantla Madhav) తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబు మాటలు జగన్ మాతృమూర్తి విజయమ్మను(Vijayamma) కించపరిచేలా ఉన్నాయని మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కడుపుకు అన్నం తింటున్నారా? లేక ఇంకేమైనా తింటున్నారా? అని నిలదీశారు. చందరబాబును మహిళలు క్షమించరని అన్నారు. వెంటనే చంద్రబాబు ముక్క నేతలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు గోరంట్ల మాధవ్.
