ఎన్‌ఎస్‌-25 మిషన్‌ పేరుతో చేపట్టనున్న అంతరిక్ష యాత్రకు ఆరుగురిని ఎంపిక చేసినట్టు బ్లూ ఆరిజిన్‌ సంస్థ ప్రకటించింది

విజయవాడకు చెందిన వ్యక్తి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. గోపీ తోటకూర అనే వ్యక్తి.. జెఫ్ బెజోస్ యాజమాన్యంలోని బ్లూ ఆరిజిన్ 'న్యూ షెఫర్డ్-25' (NS-25) మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయ యాత్రికుడిగా చరిత్ర సృష్టించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన గోపి పైలట్ కూడా.. మరో ఐదుగురు సిబ్బందితో కలిసి ఖగోళ యాత్రను ప్రారంభించనున్నారు.

ఎన్‌ఎస్‌-25 మిషన్‌ పేరుతో చేపట్టనున్న అంతరిక్ష యాత్రకు ఆరుగురిని ఎంపిక చేసినట్టు బ్లూ ఆరిజిన్‌ సంస్థ ప్రకటించింది. ఇందులో గోపీచంద్‌ తోటకూర ఒకరు. విజయవాడలో జన్మించిన గోపీచంద్‌ తోటకూర అమెరికాలో ఆరోనాటికల్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఆయన కమర్షియల్‌ జెట్‌ పైలట్‌గా పని చేశారు. అట్లాంటాలో ప్రిజెర్వ్‌ లైఫ్‌ కార్ప్‌ అనే ఒక వెల్‌నెస్‌ సెంటర్‌కు గోపీచంద్‌ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. భారత వైమానిక దళానికి చెందిన మాజీ వింగ్ కమాండర్ అయిన రాకేష్ శర్మ 1984లో అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి భారతీయ పౌరుడు అయినప్పటికీ, గోపి జీరో-గ్రావిటీ స్పేస్‌ను అనుభవించిన భారతదేశంలో జన్మించిన మొదటి అంతరిక్ష యాత్రికుడు అవుతాడు.

Updated On 13 April 2024 12:48 AM GMT
Yagnik

Yagnik

Next Story