రేషన్ లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చి 1 నుంచి రాగిపిండిని పంపిణీ చేయాలని

రేషన్ లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చి 1 నుంచి రాగిపిండిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కిలో ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయనుంది. రాగిపిండి ధర బహిరంగ మార్కెట్ లో కేజీకి రూ.40పైనే పలుకుతుండగా, ప్రభుత్వం రూ.11కే ఇవ్వనుంది. ప్రస్తుతం ఒక్కో కార్డుకు ఇస్తున్న బియ్యంలో కిలో బియ్యం బదులు రాగులు/జొన్నలు ఇస్తున్నారు. రాగి పిండిని ముందుగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అ­ల్లూ­రి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నంలో పంపిణీ చేస్తారు. రాయలసీమలోని కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో కార్డుకు ప్రస్తుతం ఇస్తున్న బియ్యంలో కిలో బియ్యం బదులు రాగులు/జొన్నలను అందజేస్తోంది. రేషన్‌కార్డుదారులు వాటిని మిల్లింగ్‌ చేసుకుని వినియోగించుకుంటున్నారు. ఇకపై లబ్దిదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా రాగిపిండినే పంపిణీ చేయనున్నారు.

పౌష్టికాహార భద్రత లక్ష్యంగా ప్రజల కోసం ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రేషన్‌ లబ్ధిదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించేందుకు స్థానిక రైతులకు సంపూర్ణ మద్దతు కల్పిస్తూ పౌరసరఫరాల సంస్థ రాగులు, జొన్నల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. వ్యవసా­య శాఖ ద్వారా రైతులను చిరుధాన్యాల సాగువైపు తీసుకెళ్తోంది. ఇందులో భాగంగానే రాయితీపై చిరు­ధాన్యాల విత్తనాలను అందిస్తోంది.

Updated On 22 Feb 2024 12:16 AM GMT
Yagnik

Yagnik

Next Story