మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు గుడ్ న్యూస్

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. పోలింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) ధ్వంసం చేసిన కేసులో జూన్ 5 వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవ‌ద్ద‌ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం నాడు పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 5 వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను జూన్ 6కి వాయిదా వేసింది. జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. జూన్ 6వ తేదీ ఉదయం 10 గంటల వరకు మాత్రమే తమ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

పిన్నెల్లి సహా వివిధ కేసులు ఎదుర్కొంటున్న అసెంబ్లీ అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు విచారించింది. తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డికి కూడా హైకోర్టులో ఊరట లభించింది. అస్మిత్ రెడ్డిని కూడా జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఏపీలో పోలింగ్ సమయంలోనూ.. పోలింగ్ తర్వాత పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలపై ఈసీ సీరియస్ అయింది.

Updated On 24 May 2024 2:24 AM GMT
Yagnik

Yagnik

Next Story