Gold Price In 2024: కొత్త ఏడాదిలో కూడా బంగారం భారమేనా..!
2023లో బంగారం (Gold) ధర పరుగులు పెట్టింది. ఈ ఏడాదిలో భారీగా బంగారం ధరలు పెరిగిపోయాయి. బహిరంగ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్ పెరగడంతో ఈ ధర పెరుగుదల కొనసాగిందని బిజినెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
2023లో బంగారం (Gold) ధర పరుగులు పెట్టింది. ఈ ఏడాదిలో భారీగా బంగారం ధరలు పెరిగిపోయాయి. బహిరంగ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్ పెరగడంతో ఈ ధర పెరుగుదల కొనసాగిందని బిజినెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తెలుగురాష్ట్రాల్లో (Telugu States) గత ఏడాది అంటే 2022లో రూ.53-54 వేల వరకు బంగారం ధరలు ఉండగా ప్రస్తుతం తులం బంగారం ధర దాదాపు 65 వేలకు చేరువకు వచ్చింది. అయితే వచ్చే ఏడాది కూడా ఇదే పరంపర కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో విలువైన లోహాలకు డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమంటున్నారు. 2024లో బంగారం ఇంతే దూకుడును ప్రదర్శిస్తుందని అంటున్నారు. పసిడితో పాటు వెండి (Silver) కూడా పరుగెత్తుతూనే ఉంది. గత ఏడాది రూ.73-74 వేల వరకు ఉన్న కిలో వెండి ధర ప్రస్తుతం దాదాపు రూ.79 వేలకు అటు ఇటుగా ఉంది. ఈ దూకుడు ఇలాగే కొనసాగుతుందని.. బంగారం, వెండి ధరలు 2024లో కూడా మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.