Tirumala : తిరుమలలో విషాదం.. చిన్నారిని చంపిన చిరుత.?
తిరుమల అలిపిరి నడక మార్గంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి తల్లిదండ్రులతో శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ బాలిక అలిపిరి నడక మార్గంలో తప్పిపోయింది.
తిరుమల(Tirumala) అలిపిరి(Alipiri) నడక మార్గంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి తల్లిదండ్రుల(Parents)తో శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ బాలిక అలిపిరి నడక మార్గంలో తప్పిపోయింది. తప్పిపోయిన పోయిన బాలిక పేరు లక్షిత(Lakshitha) కాగా.. పాప వయసు ఆరు సంవత్సరాలు. తప్పిపోయిన పాప కోసం రాత్రంతా వెతికారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఈ ఉదయం విషాద వార్త వినాల్సివచ్చింది. .
శనివారం ఉదయం నడక మార్గం(Walk Way)లో వెళ్తున్న భక్తుల(Devotees)కు నరసింహ స్వామి ఆలయం(Narasimhaswamy Temple) దగ్గర పాప మృతదేహం(Deadbody) కనిపించింది. పాప తల, శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. దీంతో పాపను చిరుతపులి చంపేసి ఉంటుందని భావిస్తున్నారు. పాప మృతదేహం వద్దకు చేరుకున్న పోలీసులు(Police) పాపను గుర్తించి చిరుత దాడిగా అంచనా వేస్తున్నారు.