Justice For Geethanjali: గీతాంజలి కుటుంబానికి 20లక్షలు అందజేత
ఆన్‌లైన్ వేధింపుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
ఆన్‌లైన్ వేధింపుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడినందుకు ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత వారం తెనాలి రైల్వేస్టేషన్ సమీపంలో గీతాంజలి అనే మహిళ గాయపడిన స్థితిలో కనిపించింది. సోమవారం ఆమె మృతి చెందింది. ఆమె రైలు ముందుకు వచ్చి ఆత్మహత్య చేసుకుందని లోకో పైలట్ తెలిపారు. ఆమె మరణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ.. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గీతాంజలి కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, 20 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
సీఎం ప్రకటించిన రూ. 20 లక్షల సాయం ఆ కుటుంబానికి అందింది. గీతాంజలి కుమార్తెలు రిషిత, రిషికల పేరిట చెరొక రూ.10 లక్షలను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆ పత్రాలను గీతాంజలి భర్త బాలచంద్ర సమక్షంలో చిన్నారులకు అందజేశారు. గీతాంజలి కుటుంబానికి ఎన్నారై పంచ్ ప్రభాకర్ రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేశారు. ఆయన పంపిన డబ్బును గురువారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కళ్లం హరికృష్ణారెడ్డి, స్థానిక నేతలు గీతాంజలి భర్త బాలచంద్ర, చిన్నారులు రిషిత, రిషికలకు అందజేశారు.