తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు(Nara chandrababu Naidu) వ్యూహాలెప్పుడూ బెడిసికొడుతూనే ఉంటాయి. ఆయన చేసే ఆలోచనలు రివర్స్ కొడుతుంటాయి. సపోజ్‌ మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఉదంతాన్నే తీసుకోండి. ఆయన రాజకీయ జీవితానికి ముగింపు పలకడానికి మాస్టర్‌ ప్లాన్‌ వేశారు చంద్రబాబు. విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని అనుకున్నారు.

తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు(Nara chandrababu Naidu) వ్యూహాలెప్పుడూ బెడిసికొడుతూనే ఉంటాయి. ఆయన చేసే ఆలోచనలు రివర్స్ కొడుతుంటాయి. సపోజ్‌ మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఉదంతాన్నే తీసుకోండి. ఆయన రాజకీయ జీవితానికి ముగింపు పలకడానికి మాస్టర్‌ ప్లాన్‌ వేశారు చంద్రబాబు. విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని అనుకున్నారు. అంటే మంత్రి బొత్స సత్యనారాయణపై(Botsa Satyanarayana) పోటీ అన్నమాట! బొత్సపై ఎలాగూ గెలవరు కాబట్టి ఈ ఎన్నికలతో గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) పొలిటికల్ కెరీర్‌ ఖతం అవుతుందన్నది చంద్రబాబు ప్లాన్‌. గంటా మీద బాబుకెందుకంత కసి అంటే, 2019లో తెలుగుదేశంపార్టీ ఓడిపోయిన తర్వాత నుంచి గంటా పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారట! ఆ మధ్యన టీడీపీకి బై చెప్పేసి వైసీపీలో చేరతారనే టాక్‌ కూడా వినిపించింది. అయితే గంటాను పార్టీలో చేర్చుకోవడం జగన్‌కు అంతగా ఇష్టం లేదు. సరే, ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చాయి కాబట్టి గంటా మళ్లీ యాక్టివ్‌ అయ్యారు. టీడీపీ అధినాయకత్వానికి దగ్గరవ్వడానికి ప్రయత్నించారు. అయితే చీపురుపల్లి నుంచి పోటీ చేయాల్సిందిగా గంటాకు చంద్రబాబు సూచించారు. విశాఖ జిల్లాలో ఏ నియోజకవర్గం టికెట్‌ ఇచ్చినా తీసుకుంటానని, చీపురుపల్లి వద్దని గంటా వేడుకున్నారు. అయినప్పటికీ చంద్రబాబు పట్టినపట్టు వదల్లేదు. చంద్రబాబు కుతంత్రమేమిటో గంటాకు అర్థమయ్యింది. ఎట్టిపరిస్థితుల్లోనూ చీపురుపల్లి నుంచి పోటీ చేయకూడదని డిసైడయ్యారు. ఇస్తే విశాఖ(Vishakapatnam) జిల్లాలో టికెట్‌ ఇవ్వాలని, లేకపోతే తన దారి తాను చూసుకుంటానని చంద్రబాబుతో చెప్పేయడానికి గంటా ప్రిపేర్‌ అయ్యారు. కొసమెరుపు ఏమిటింటే వైసీపీ నేతలతో గంటా మాట ముచ్చట జరుపుతుండటం. విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు వైసీపీకి బలమైన నాయకులు కావాలి. ఏమో గంటా రాకను వైసీపీ ఆహ్వానించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఇదే జరిగితే మాత్రం చంద్రబాబుకు గంటా పెద్ద షాకిచ్చినట్టే అవుతుంది.

Updated On 2 March 2024 3:34 AM GMT
Ehatv

Ehatv

Next Story