వినాయకచవితి(Vinayaka Chavithi) నవరాత్రి ఉత్సవాలు దేశమంతటా వైభవంగా జరుగుతున్నాయి. వీధివీధిన వినాయక మండపాలు కళకళలాడుతున్నాయి.వాడవాడలా కొలువుదీరిన గణనాథులు సందడి చేస్తున్నారు. స్థోమతుకు తగినట్టుగా మండపాలను తీర్చిదిద్దారు భక్తులు. కొందరు భారీ సెట్టింగులతో మండపాటను ముస్తాబు చేస్తే, మరికొందరు ఆకర్షణీయమైన వినాయక ప్రతిమలను ఏర్పాటు చేశారు.

వినాయకచవితి(Vinayaka Chavithi) నవరాత్రి ఉత్సవాలు దేశమంతటా వైభవంగా జరుగుతున్నాయి. వీధివీధిన వినాయక మండపాలు కళకళలాడుతున్నాయి.వాడవాడలా కొలువుదీరిన గణనాథులు సందడి చేస్తున్నారు. స్థోమతుకు తగినట్టుగా మండపాలను తీర్చిదిద్దారు భక్తులు. కొందరు భారీ సెట్టింగులతో మండపాటను ముస్తాబు చేస్తే, మరికొందరు ఆకర్షణీయమైన వినాయక ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా(NTR District) నందిగామలో(Nandigama) అయితే వినాయక నవరాత్రులు అద్భుతంగా జరుగుతున్నాయి. వాసవి మార్కెట్‌ గణపతి ఉత్సవ కమిటీ(Vasavi Market Ganapati Festival Committee) అయితే అందరినీ ఆకట్టుకునే రీతిలో వినాయకుడిని తీర్చిదిద్దింది. వినాయకుడిని కోటిన్నర రూపాయల విలువైన కరెన్సీ నోట్లతో డెకరేట్‌(Currency Note Decoration) చేసింది. 500 రూపాయలు, 200 వందల రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయల కొత్త కరెన్సీ నోట్లతో అలంకరణ చేశారు. విఘ్ననాయకుడి విగ్రహంతో పాటు మండపాన్ని కూడా కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ వినూత్న వినాయకుడిని దర్శించుకోవడానికి ఇరుగుపొరుగు ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏటా కరెన్సీతో గణేషుడిని అలంకరించడం వాసవి మార్కెట్ ఉత్సవ కమిటీ ఆనవాయితీగా పెట్టుకుంది.

Updated On 22 Sep 2023 3:26 AM GMT
Ehatv

Ehatv

Next Story