Bandla Ganesh : బండ్ల బిల్డప్‌పై గాంధీభవన్‌లో గుసగుసలు
నిత్యం వార్తల్లో పొద్దు గడిపే వ్యక్తి ఎవరన్నా అంటే తెలుగురాష్ట్రాల్లో టక్కున గుర్తుకొచ్చే పేరు బండ్ల గణేష్(Bandla ganesh). అటు ఏపీ, ఇటు తెలంగాణ రాజకీయాల్లో తల దూరుస్తూ నిత్యం ఏదో ఒక వివాదంలో ట్రెండ్ అవుతుంటాడు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) అధికారంలోకి రాకుంటే 7 వో క్లాక్ బ్లేడ్‌తో గొంతు కోసుకుంటానని సంచలన ప్రకటన చేశాడు. ఆ తర్వాత బీఆర్‌ఎస్ కార్యకర్తలు, కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని ప్రశ్నించగా ఎన్నికల సమయంలో ఏవేవో అంటుంటాం..
నిత్యం వార్తల్లో పొద్దు గడిపే వ్యక్తి ఎవరన్నా అంటే తెలుగురాష్ట్రాల్లో టక్కున గుర్తుకొచ్చే పేరు బండ్ల గణేష్(Bandla ganesh). అటు ఏపీ, ఇటు తెలంగాణ రాజకీయాల్లో తల దూరుస్తూ నిత్యం ఏదో ఒక వివాదంలో ట్రెండ్ అవుతుంటాడు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) అధికారంలోకి రాకుంటే 7 వో క్లాక్ బ్లేడ్‌తో గొంతు కోసుకుంటానని సంచలన ప్రకటన చేశాడు. ఆ తర్వాత బీఆర్‌ఎస్ కార్యకర్తలు, కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని ప్రశ్నించగా ఎన్నికల సమయంలో ఏవేవో అంటుంటాం.. అన్ని నిజాలవుతాయా అని దాటవేస్తూ కాలం గడిపాడు. గత ఐదేళ్లుగా మనోడు ట్రోల్ అవుతూనే ఉన్నాడు. చంద్రబాబుకు(chandrababu) మద్దతుగా టీడీపీ(TDP) అభిమానులు, కార్యకర్తలు గచ్చిబౌలి స్టేడియంలో నిర్మించిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఏపీ సీఎం జగన్‌పై(AP CM Jagan) రెచ్చిపోయాడు. 2018లో తెలంగాణ ఎన్నికల తర్వాత కొంతకాలం సైలెంట్‌గా ఉంటూ తాను ఏ పార్టీలో లేనని ప్రకటించిన బండ్ల.. ఆ తర్వాత అప్పుడప్పుడు వార్తా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. బీఆర్‌ఎస్‌ను ఆకాశానికెత్తేవాడు. పాలమూరును పచ్చగా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పొగడ్తలతో ముంచెత్తేవాడు. ఏ మాటకామాట చెప్పుకోవాలంటే బీఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్ న్యూయార్క్‌లా మారిందని ఆ పార్టీని ఆకాశానికెత్తాడు.
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్‌కు(Congress) మెల్లగా దగ్గరయ్యాడు. కాంగ్రెస్‌కు అనుకూలంగా, బీఆర్‌ఎస్‌కు(BRS) వ్యతిరేకంగా సోషల్ మీడియాలో(Social media) పోస్టులు పెడుతూ వస్తున్నాడు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉంటుందని... తాను ఏడో తేదీ నుంచే ఎల్బీస్టేడియంలో పడుకుంటానని చెప్తూ మరోసారి మీడియాలో మెరిసాడు. కాంగ్రెస్‌కు అనుకూల ఫలితాలు వచ్చిన తర్వాత ఇక మనోడు రెచ్చిపోతున్నాడు. సీఎం రేవంత్(CM Revanth reddy) ప్రమాణస్వీకారం తర్వాత ఆయనకు దగ్గరయ్యేందుకు బండ్ల గణేష్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడట. రేవంత్ ఆరుడు, శూరుడు, వీరుడు అని చెప్పుకుంటూ ఆకాశానికి ఎత్తుకుంటున్నాడు. అయితే కాంగ్రెస్‌ను తానే అధికారంలోకి తీసుకొచ్చినంత బిల్డప్ ఇస్తున్నాడని గాంధీభవన్‌లో(Gandhi Bhavan) అయితే కాంగ్రెస్ నేతలు గుసగుసలు పెట్టుకుంటున్నారని తెలిసింది. ఇతని వ్యవహారశైలి చాలా అతిగా ఉందని గాంధీభవన్‌లో నేతలు చర్చించుకుంటున్నారట. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రేవంత్‌ను కలవడం ఆయనకు బొకేలు ఇచ్చి ఫొటోలు దిగడం.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అతి చేస్తున్నాడని కాంగ్రెస్ నేతలు మాట్లాడుకుంటున్నారట. రేవంత్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లడం ఆయనకు బొకేలు(Boquet) ఇవ్వడం.. శాలువాలు కప్పి సన్మానాలు చేయడం... ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పెద్దలు ఎవరొచ్చినా 'అసలు కాంగ్రెస్ నేతల కంటే' ఈ కొసరు కాంగ్రెస్ నేత ముందుగా వెళ్లి వారిని ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటున్నాడట. రేవంత్ ఢిల్లీ వెళ్తే.. అంత కంటే ముందే మనోడు ఢిల్లీ వెళ్లి.. అక్కడి ఎయిర్‌పోర్టులో స్వాగతం చెప్తున్నాడు. దీంతో బండ్ల గణేష్ వ్యవహారశైలి నచ్చక లోలోపల కాంగ్రెస్ నేతలు గొణుక్కుంటున్నారట. ఓరి నాయనో... ఈ బండ్ల బిల్డప్ చూడలేకపోతున్నామని వాపోతున్నారట.