Tragedy strikes Game Changer Event : ఫ్యాన్స్ మరణంపై రాంచరణ్ సంతాపం
అభిమానుల మృతిపై ప్రగాఢ సంతాపం రామ్ చరణ్ సంతాపం వ్యక్తం చేశారు.
అభిమానుల మృతిపై ప్రగాఢ సంతాపం రామ్ చరణ్ సంతాపం వ్యక్తం చేశారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రిటర్న్ జర్నీలో మృతి చెందిన అభిమానుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'గేమ్ చేంజర్'. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా శనివారం రాజమహేంద్రవరంలో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు హాజరయ్యారు. వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న టైంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ డీ కొట్టడంతో మరణించారు.
అభిమానుల మృతిపై రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆ ఘటన గురించి తెలిసిన వెంటనే అభిమానుల ఇంటికి సన్నిహితులను తన మనుషులను పంపించి ధైర్యం చెప్పించారు. కుటుంబాలకు చెరొక ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. రామ్ చరణ్ మాట్లాడుతూ... ''ఈవెంట్ దగ్గరకు వచ్చిన అభిమానులు సురక్షితంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటాం. మన ఏపీ డిప్యూటీ సీఎం, బాబాయ్ పవన్ కల్యాణ్ కోరుకునేది కూడా అదే. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరం. అభిమానుల కుటుంబాలు ఎంత బాధ పడతాయో అర్థం చేసుకోగలను. నాకు అంతే బాధగా ఉంది. అభిమానుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను'' అని చెప్పారు.
- Two Lost LifeGame Changer eventRam Charan Extends Support of Rs. 10 Lakhs to Families of Fans Who Lost Their LivesRam CharanPawan Kalyanlatest newstelugu newsTragedy strikes Game Changer eventDil RajuRam Charan Announces Financial Support of Rs. 10 Lakhsehatvviral newstollywood newsGame Changer movie