నగరి నియోజకవర్గం పుత్తూరులో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్‌

నగరి నియోజకవర్గం పుత్తూరులో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్‌ 'ఎమ్మెల్యే' అంటూ పోస్టర్లు వెలిశాయి. ఓట్ల లెక్కింపు జరగముందే ఆయనే ఎమ్మెల్యే అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఓ బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటు సందర్భంగా ఉంచిన ఫ్లెక్సీల్లో భానుప్రకాష్‌ ఎమ్మెల్యే, నగరి అంటూ ఉంచారు.

ఈ ఫ్లెక్సీ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. బహిరంగంగా ఒక అభ్యర్థి ఎమ్మెల్యే అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే పుత్తూరు టీడీపీ నాయకులు ఇలాంటి పనులు చేయడంపై పలు విమర్శలు వస్తున్నాయి. ప్రజలను రెచ్చగొట్టడానికే ఇలాంటి పథకం వేశారని అంటున్నారు.

Updated On 24 May 2024 2:24 AM GMT
Yagnik

Yagnik

Next Story