MLA Thippala Nagi Reddy : సీఎం జగన్‌కు ఎల్లప్పుడూ నమ్మకస్తులుగా ఉంటాం
ముఖ్యమంత్రి జగన్‌కు(CM Jagan) ఎల్లప్పుడూ నమ్మకస్తులుగా ఉంటామని గాజువాక ఎమ్మెల్యే(Gajuwaka MLA) తిప్పల నాగిరెడ్డి(Thippala Nagi Reddy) తెలిపారు. ఆయన తన కుమారుడు దేవన్ రెడ్డితో(Devan reddy) కలిసి మంగళవారం వైసీపీ(YCP) సీనియర్ నేత వైవీ సుబ్బా రెడ్డిని(YV Subba Reddy) కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను గాని, నా కుమారులు కానీ ఎల్లప్పుడూ ముఖ్యమంత్రి జగన్‌కు నమ్మకస్తులుగా, పార్టీకి విధేయులుగా ఉంటామని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి జగన్‌కు(CM Jagan) ఎల్లప్పుడూ నమ్మకస్తులుగా ఉంటామని గాజువాక ఎమ్మెల్యే(Gajuwaka MLA) తిప్పల నాగిరెడ్డి(Thippala Nagi Reddy) తెలిపారు. ఆయన తన కుమారుడు దేవన్ రెడ్డితో(Devan reddy) కలిసి మంగళవారం వైసీపీ(YCP) సీనియర్ నేత వైవీ సుబ్బా రెడ్డిని(YV Subba Reddy) కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను గాని, నా కుమారులు కానీ ఎల్లప్పుడూ ముఖ్యమంత్రి జగన్‌కు నమ్మకస్తులుగా, పార్టీకి విధేయులుగా ఉంటామని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ శ్రేయస్సు కోసం కంకణబద్ధులై ఉంటామని తెలిపారు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని.. అదే మాకు ముఖ్యమని.. నిన్నటి నుండి తమ మీద వస్తున్న పుకార్లకు నాగిరెడ్డి సమాధానం ఇచ్చారు.
దేవన్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్న నేను నా వ్యక్తిగత పనులు మీద బయటకి వెళ్ళాను. వెళ్లేముందు మా ఇంచార్జ్ సుబ్బారెడ్డితో మాట్లాడి వెళ్ళాను. అక్కడ ఫోన్ సిగ్నల్స్ లేవు. నిన్న నేను మళ్ళీ సిటీకి వచ్చే లోపు నామీద చాలా పుకార్లు లేపారు. అయినా మా నాన్న ఎమ్మెల్యేగా ఉండగా నేనెందుకు పార్టీకి రాజీనామా చేస్తాను. నేను పార్టీతోనే వున్నానని సుబ్బారెడ్డికి వివరణ ఇచ్చేందుకే మేము వచ్చాము. తాము ఎప్పటికీ సీఎం జగన్ మాటకి, పార్టీకి కట్టుబడి ఉంటాము. పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తామని తెలిపారు.
ఇదిలావుంటే.. సోమవారం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన కొద్ది గంటల తర్వాత.. విశాఖ జిల్లా గాజువాక వైసీపీ కోఆర్డినేటర్ దేవన్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే.. నిన్న ప్రకటించిన ఇంచార్జుల లిస్టులో యాదవ సామాజికవర్గానికి చెందిన వరికూటి రామచంద్రరావును గాజువాక కోఆర్డినేటర్‌గా వైఎస్‌ఆర్‌సిపీ ప్రకటించడం గమనార్హం