Gaju Glass : జనసేనకు గాజు గ్లాసు గుర్తు ఖరారు
జనసేన పార్టీకి మరోసారి గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది.

Gaju Glass Symbol for Janasena is finalized
జనసేన(Janasena) పార్టీకి మరోసారి గాజు గ్లాసు(Gaju Glass)ను గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్(Email) ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక(Telangana Assembly Elections)ల్లో గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్ధులు పోటీ చేశారు. అలాగే ఈ సారి ఎన్నికల్లో కూడా గాజు గ్లాసు గుర్తుతోనే జనసేన అభ్యర్ధులు ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఎన్నికల సంఘం ఉత్తర్వు కాపీలను పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్(Sambashiva Prathap).. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కి అందచేశారు.
