3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ప్రభుత్వం, పలు పథకాలకు కేటాయింపులను చూస్తే కోతలు పెట్టినట్లు తెలుస్తోంది.

3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ప్రభుత్వం, పలు పథకాలకు కేటాయింపులను చూస్తే కోతలు పెట్టినట్లు తెలుస్తోంది. మహాశక్తి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణ కోసం బడ్జెట్‌లో కేటాయింపులు జరగలేదు. తల్లికి వందనం పథకంలో భాగంగా విద్యార్థులందరికీ నగదు పంపిణీచేస్తే రూ.12,500 కోట్లకుపైగా అవసరం పడతాయి కానీ బడ్జెట్‌లో రూ.9 వేల కోట్లే కేటాయించారు. మహిళలకు నెలకు 1500 ఇస్తామని బడ్జెట్‌లో దానిని ప్రస్తావించలేదు. దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు కోటీ 55 లక్షల మంది లబ్దిదారులకు ఇస్తే రూ.4 వేల కోట్లు అవసరం అవుతాయి.. కానీ ఈ పథకం కింద రూ.2600 కోట్లే కేటాయించారు. ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడా హామీని బడ్జెట్‌లో చూపించలేకపోయింది. అన్నదాత సుఖీభవ కింద ప్రతీరైతుకు రూ.20 వేలు ఇస్తామని చెప్పిన కూటమి సర్కార్‌, బడ్జెట్‌లో మాత్రం నిధులకు కోతలు పెట్టినట్లే అర్థమవుతోంది. రైతులకు రూ.20 వేల చొప్పున ఇస్తే 10500 కోట్లు అవసరం అవుతాయి కానీ బడ్జెట్‌లో రూ.6,300 కోట్లే కేటాయించింది. ఉచిత బస్సు పథకానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. నిరుద్యోగులకు నెలకు 3 వేలు నిరుద్యోగ భృతిపై బడ్జెట్‌లో ప్రస్తావనే లేదు.

ehatv

ehatv

Next Story