Pawan Kalyan : పవన్ పోటీ చేసే సీటు ఇదేనా..రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ !
ఏపీ రాజకీయాలపై ఇప్పుడు అందరి దృష్టిపడింది. ఎన్నికలకు ఇంకొద్ది నెలల సమయమే ఉండటంతో ఏపీలో(Andhra Pradesh) రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ పెద్ద ఎత్తున అభ్యర్థులను మారుస్తుండగా..టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటుపై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో ఈసారి ముఖ్య నేతలు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసి..ఓటమిని చవి చూసిన పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది.

గత ఎన్నికల్లో బీఎస్పీ-వాపమక్ష పార్టీల మధ్యతో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన పవన్ కు చేదు ఫలితాలు ఎదురయ్యాయి. పోటీ చేసిన రెండు చోట్ల ఘోర పరాభవం తప్పలేదు. భీమవరంలో(Bhimavaram) వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఓడిపోగా.. గాజువాకలో(Gajuwaka) మూడోస్థానానికి పడిపోవడం జన సైనికులు జీర్ణించుకోలేకపోయారు. అయితే ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో పవన్ కల్యాణ్ ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో చేదు అనుభవం ఎదురైన నేపథ్యంలో పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాపు(Kapu) సామాజికవర్గం ఓటుబ్యాంకు అధికంగా ఉన్న పిఠాపురం(Pithapuram), కాకినాడ రూరల్(Kakinada rural), తిరుపతి(Tirupathi) నియోజకవర్గాలను ప్రాథమికంగా ఎంపిక చేసుకన్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి ఒకే చోట నుంచి పోటీ చేసి.. అసెంబ్లీలో అడుగుపెట్టాలనే లక్ష్యంతోనే పవన్ కల్యాణ్ ఉన్నారట. వాటిలో పిఠాపురం నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమని సర్వేల్లో తేలిందట. అందుకే వారాహియాత్ర సమయంలోనూ పిఠాపురానికి ఎక్కువ సమయం ఇచ్చారట పవన్ కల్యాణ్. మరోవైపు యాదృచ్ఛికంగా..మూడు స్థానాల్లో టీడీపీ(TDP) బలంగా లేకపోవడంతో ఇప్పటికీ అభ్యర్థులపై క్లారిటీ లేదు. పవన్ పోటీ చేసే స్థానం ఫైనల్ అయిన తర్వాతే మిగతా చోట్ల అభ్యర్థులను పెడతారనే ప్రచారం కూడా ఉంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది ఆ పార్టీ వారికే కాదు..సహజంగా అందరికీ ఆసక్తి కలిగించే విషయమే. అయితే గతంలో పోటీ చేసిన భీమవరం, గాజువాక నుంచి ఈసారి కూడా బరిలోకి దిగుతారనే ప్రచారం కూడా ఉంది. అలాగే కాపు సామాజికవర్గంతోపాటు పట్టణ ఓటర్లు బలంగా ఉండే..విశాఖ ఉత్తరం(Vishaka North) నుంచి పోటీ చేయాలనే ఆలోచన కూడా ఉందట. మొత్తానికి పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానాలపై రకరకాల ఊహాగాలే తప్పా..ఆయన ఖచ్చితంగా ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే క్లారిటీ మాత్రం లేదు. వారాహి(varahi) యాత్రలో తాను ఎక్కడికి వెళ్తే అక్కడి నుంచే పోటీ చేస్తున్నట్టు ప్రకటనలు చేయడం మరింత గందరగోళంగా మారింది. పార్టీ పెట్టి పదేళ్లు అవుతున్నా..ఏదో ఒక నియోజకవర్గంపై గట్టిగా ఫోకస్ పెట్టకపోవడం కూడా పవన్‌కు మైనస్‌గా మారిందనే చర్చ ఉంది. ఎన్నికల సమయంలో నియోజకవర్గాన్ని(Constituency) వెత్తుక్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. మరోవైపు ఈసారి కూడా పవన్ కల్యాణ్ ఓటమే టార్గెట్‌గా అధికార వైసీపీ(YSRCP).. ఆయనకు వ్యతిరేకంగా బలమైన అభ్యర్థిని బరిలోకి దించే వ్యూహం రూపొందిస్తోంది. ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలుపు ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారిందనే చెప్పాలి.