ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ(AP BJP) చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandheswari) మరో నాలుగైదు నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha) పోటీ చేస్తారా? చేస్తే ఎక్కడ్నుంచి? ఒకవేళ పోటీకి దూరంగా ఉంటే ఓ పార్టీ చీఫ్‌గా ఉంటూ బరిలో దిగలేదంటూ నలుగురు నాలుగు రకాలుగా అనుకునే ప్రమాదం ఉంటుంది కదా! ఇప్పుడు ఈ సందేహాలు ఆమె హార్డ్‌కోర్‌ అభిమానులను పట్టి పీడిస్తున్నాయి. నిజమే ఆమెకు ఇప్పుడు నమ్మకమైన నియోజకవర్గం లేకుండాపోయింది. అక్కడ్నుంచి నిలబడితే కచ్చితంగా గెలుస్తానని ధైర్యంగా చెప్పుకునే నియోజకవర్గం ఒక్కటి కూడా లేదు. 2014లో అయితే తెలుగుదేశం పార్టీతో(TDP) పొత్తులో భాగంగా రాజంపేట నియోజకవర్గం దొరికింది.

అక్కడ్నుంచి పోటీ చేయడం పురంధేశ్వరికి సుతరామూ ఇష్టం లేదు. గెలవలేమని తెలిసే కావాలని పురంధేశ్వరికి రాజంపేట సీటును చంద్రబాబు కేటాయించారని అప్పట్లో చాలా మంది అనుకున్నారు. ఇది నిజం కూడా! చంద్రబాబు(Chandrababu) అనుకున్నట్టుగానే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చేతిలో పురంధేశ్వరి ఓటమిపాలయ్యారు. 2019 వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకుంది! పైగా నరేంద్రమోదీని(PM Narendra Modi) చంద్రబాబు ఘాటైన పదజాలంతో విమర్శించే సరికి గ్యాప్‌ చాలా పెరిగిపోయింది. జనసేన అధినేత పవన్‌ కూడా టీడీపీకి దూరమయ్యారు. అన్ని పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి.

విభజన హామీలను నెరవేర్చలేదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీపై ఏపీ ప్రజలు పీకల్దాక కోపం పెట్టుకున్నారు. ఆ కోపాన్ని ఎన్నికల్లో చూపించారు. విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన పురంధేశ్వరికి కూడా జనం తమ ఆగ్రహాన్ని చూపించారు. ఆమెకు కేవలం 2.73 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ఇదే లోక్‌సభ స్థానం నుంచి 2009లో ఆమె కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసినప్పుడు మాత్రం విజయం లభించింది. కేంద్రంలో మంత్రి కూడా అయ్యారు. 2014లో కాంగ్రెస్‌కు ఫ్యూచర్‌ లేదని తెలుసుకుని బీజేపీలో చేరారు పురంధేశ్వరి. తనకు హోదాను, మంత్రి పదవిని ఇచ్చిన కాంగ్రెస్‌ను నిర్దాక్షణ్యంగా వదిలిపెట్టారు. బీజేపీలో చేరినప్పట్నుంచి లోక్‌సభలో అడుగుపెట్టాలని అనుకుంటున్నారు కానీ అది సాధ్యం కావడం లేదు.

ఏపీలో బీజేపీకి ఏ మాత్రం బలమున్నదో పురంధేశ్వరికి తెలియంది కాదు. రెండుసార్లు లభించిన పరాజయాలతోనైనా ఆమెకు తత్వం బోధపడలేదు. ముచ్చటగా మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం తనకు ఎక్కడ సీటిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానని అంటున్నారు. పోటీ చేస్తారు సరే, విజయం మాటేమిటి? 2014లో మాదిరిగానే మళ్లీ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి కడితే తప్ప బీజేపీ ఒంటరిగా గెలిచే అవకాశాలు ఏపీలో అసలు లేవు. కేంద్రంలో బీజేపీ స్ట్రాంగ్‌గానే ఉండొచ్చు. ఏపీలో మాత్రం చాలా బలహీనంగా ఉంది. ఏదో ఒక నియోజకవర్గం నుంచి గెలిస్తే మంత్రి మండలిలో చోటు దొరకవచ్చన్నది పురంధేశ్వరి ఆశ! అందుకే టీడీపీ-బీజేపీ-జనసేనలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. పరిస్థితులు చూస్తే కూటమికి ఛాన్స్‌ లేదనిపిస్తోంది. మరి పురంధేశ్వరి కేంద్ర మంత్రి ఆశలు ఈసారి కూడా తీరవా?

Updated On 27 Dec 2023 5:52 AM GMT
Ehatv

Ehatv

Next Story