APSRTC : గుడ్న్యూస్.. ఆర్టీసీలో విద్యార్థులకు ఉచిత ప్రయాణం
ఏపీలో పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఆర్‌టీసీ శుభవార్త చెప్పింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని తెలిపింది.

Free travel for students in RTC
ఏపీలో పదో తరగతి పరీక్షలు(1oth Exams) రాయబోతున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఆర్‌టీసీ(APSRTC) శుభవార్త చెప్పింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని తెలిపింది. పరీక్ష రాసేవారు తమ హాల్‌టికెట్లు చూపించి ఇంటి నుంచి పరీక్ష కేంద్రాలకు.. ఆ తర్వాత ఇళ్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులో ఉందని.. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షల నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
