Fraud Woman arrest In TTD : శ్రీవారి భక్తులను బురుడి కొట్టించిన మహిళ
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని(Venkateshwara swamy) దర్శించుకోవాలన్న కోరిక అందరికీ ఉంటుంది.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని(Venkateshwara swamy) దర్శించుకోవాలన్న కోరిక అందరికీ ఉంటుంది. సులభంగా శ్రీవారి దర్శనం అయితే బాగుండని అందరూ అనుకుంటున్నారు. ఈ బలహీనతను కొందరు మోసగాళ్లు అవకాశంగా తీసుకుంటున్నారు. ఇలాగే ఓ మహిళ అయిదు సుప్రభాత సేవ(suprabatha seva) టిక్కెట్లు, ఆరు విఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లు(VIP break darshanam), విఐపీ గెస్ట్ హౌస్‌లో గదులు ఇప్పిస్తానంటూ భక్తులను మోసం చేసింది. 41 వేల రూపాయలను భక్తులు నుండి తీసుకొని ఉడాయించింది. తాము మోసపోయామని తెలుసుకున్న హైదరాబాద్‌కు చెందిన వేంకటేశ్వర్లు విజిలెన్స్ వింగ్ అధికారులను కలుసుకుని అన్ని విషయాలను వివరించారు. విజిలెన్స్ విచారణలో మోసం చేసిన మహఙళ తిరుపతి కి చెందిన పాత నేరస్థురాలు కె.నవ్యశ్రీ అని తేలింది. విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదుతో టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో రెండు కేసులలో ముద్దాయిగా ఉన్న నవ్యశ్రీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
