ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆర్‌.కృష్ణయ్య(R. Krishnaiah) పేరు అంతో ఇంతో తెలిసే ఉంటుంది.

ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆర్‌.కృష్ణయ్య(R. Krishnaiah) పేరు అంతో ఇంతో తెలిసే ఉంటుంది. రుద్రమదేవి(Rudrama devi) సినిమాలో అల్లు అర్జున్‌లా(Allu arjun) ఆయన ఆడా ఉంటారు.. ఈడా ఉంటారు. బీసీ సంఘ నాయకుడిగా ఆర్‌.కృష్ణయ్యకు మంచి పేరే ఉంది. తెలంగాణకు చెందిన ఆర్‌.కృష్ణయ్యకు రాజ్యసభ పదవిని కట్టబెట్టారు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan). అప్పుడే చాలా మంది జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో బీసీ సంఘాల నాయకులు చాలా మందే ఉన్నారు. వారెవరనీ కాకుండా కృష్ణయ్యనే రాజ్యసభకు ఎందుకు పంపించారన్నది ఇప్పటికీ అంతుపట్టని విషయం. తెలంగాణ నుంచి ఆర్‌.కృష్ణయ్యను ప్రత్యేకంగా ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో, ఆర్‌.కృష్ణయ్య వల్ల వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌కు(YSRCP) చేకూరిన మేలు ఏమిటో జగన్మోహన్‌రెడ్డికే తెలియాలి. తనకు రాజ్యసభ పదవిని కట్టబెట్టినందుకు జగన్‌ను అప్పుడప్పుడు పొగిడారు కృష్ణయ్య. మొన్నామధ్య రాజ్యసభ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు కృష్ణయ్య. ఆయన ఎందుకు రాజీనామా చేశారో రాజకీయాలపై కొంచెం అవగాహన ఉన్నవారికి ఈజీగా అర్థమవుతుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆర్‌.కృష్ణయ్య ఇప్పుడు తెలుగుదేశంపార్టీవైపు(TDP) చూస్తున్నారని వినికిడి. ఒకవేళ టీడీపీలో చోటు లభించకపోతే టీడీపీ సిఫారసుతో బీజేపీలో చేరినా చేరవచ్చు. బీసీ సంఘాల నాయకుడిగా ఉన్న ఇమేజ్‌తో ఓ రాజకీయ పార్టీని పెట్టాలనుకున్నారు కృష్ణయ్య. పార్టీ పెట్టడమంటే మాటలు కాదని తెలుసుకుని తెలుగుదేశంపార్టీఓల చేరారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆర్‌.కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. తాము బీసీలకు ప్రముఖ స్థానం కల్పిస్తున్నామని చెప్పుకుంది టీడీపీ. ఆ విధంగా ఎన్నికల్లో ప్రచారం చేసుకుంది. తెలంగాణలో టీడీపీ గెలుస్తుందని, తాను ముఖ్యమంత్రి అవుతానని బహుశా కృష్ణయ్య కూడా అనుకుని ఉండరు. ఎందుకంటే అప్పుడు తెలుగుదేశంపార్టీ పరిస్థితి అలా ఉంది కాబట్టి. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణ ప్రజలు బాగా కోపం పెట్టుకున్నారు. ఎలాగూ పార్టీ గెలిచే అవకాశం లేదు కాబట్టే కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు కానీ, పార్టీ గెలిచే ఛాన్సు ఉంటే చంద్రబాబు ఆ పని చేసి ఉండేవారే కాదు. ఈ విషయం చంద్రబాబును ఎరిగిన వారందరికీ తెలుసు. ఎబ్బీనగర్‌ నియోజకవర్గం నుంచి కృష్ణయ్య గెలిచారు కానీ రాజకీయాల పట్ల చురుకుగా వ్యవహరించలేదు. చంద్రబాబు పన్నాగాన్ని పసిగట్టిన కృష్ణయ్య నెమ్మదిగా ఆ పార్టీకి దూరం జరుగుతూ వచ్చారు. కుల సంఘాల నాయకత్వానికి పరిమితం అయ్యారు. అలాంటి ఆర్ కృష్ణయ్యకు జగన్మోహన్‌రెడ్డి రాజ్యసభ పదవి ఇవ్వడమేమిటో ! పోనీ పదవి ఇచ్చిన కృతజ్ఞత అయినా కృష్ణయ్యకు ఉందా? మేలు చేసిన జగన్‌నే తిట్టిపోశారు. ఘాటైన విమర్శలు చేశారు. రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన ఆర్‌.కృష్ణయ్య బీజేపీలో చేరతారని అనుకున్నారు. కానీ ఇప్పుడు టీడీపీలో చేరడానికి రెడీ అవుతున్నారని తెలిసింది.

Eha Tv

Eha Tv

Next Story