వైఎస్‌ఆర్‌ జిల్లా(YSR District) ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి(Shivaprasad Reddy) శపథం చేశారు.

వైఎస్‌ఆర్‌ జిల్లా(YSR District) ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి(Shivaprasad Reddy) శపథం చేశారు. వచ్చే ఎన్నికలు ఈవీఎంలతోనే(EVM) నిర్వహిస్తే మాత్రం తాను పోటీ చేయనని ప్రకటించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్‌(EVM tampering) చేయడం వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందని శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికలలో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్‌ పేపర్లను(ballot papers) వాడాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ ఈవీఎంలనే వాడితే మాత్రం తాను పోటీ చేసే ప్రసక్తే లేదన్నారు. ఈవీఎంల‌లో అవ‌క‌త‌వ‌క‌లు జరిగాయని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. కొంత మంది న్యాయపోరాటానికి కూడా దిగారు. అయితే ఈసీ నుంచి తమకు సహకారం అందడం లేదని వారు ఆరోపిస్తున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మందికి ఈవీఎంలపై అనుమానాలు కలుగుతున్నాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి కూడా సందేహాన్ని వెలిబుచ్చారు. అభివృద్ధి చెందిన చాలా దేశాలలో ఇప్పటికీ బ్యాలెట్‌ విధానంలోనే ఎన్నికలు జరుగుతున్నాయని జగన్‌ తెలిపారు. ఈవీఎంలపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని ఆయన సూచించారు.

Eha Tv

Eha Tv

Next Story