Yanamala Krishnudu : టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. పార్టీని వీడిన కృష్ణుడు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాకినాడకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల కృష్ణుడు శనివారం పార్టీని వీడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాకినాడకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల కృష్ణుడు శనివారం పార్టీని వీడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. యనమల కృష్ణుడుతో పాటు టీడీపీ సీనియర్ నేతలు పీ శేషగిరిరావు, హరికృష్ణ, ఎల్ భాస్కర్ కూడా వైఎస్సార్సీపీలో చేరారు. యనమల కృష్ణుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తమ్ముడు. చేరికల కార్యక్రమంలో తుని ఎమ్మెల్యే అభ్యర్థి దాడిశెట్టి రాజా, వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కూడా హాజరయ్యారు.
యనమల కృష్ణుడు తుని టికెట్ ఆశించారు. కానీ చంద్రబాబు ఆ టికెట్‌ను యనమల రామకృష్ణుడు కూతురు దివ్యకు ఇచ్చారు. దీంతో కృష్ణుడు టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలతో సంప్రదింపుల తర్వాత ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.