గుడ్ మార్నింగ్ ధర్మవరం' కార్యక్రమం ద్వారా ధర్మవరం వైసీపీ(YCP) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి(Kethireddy) తెలుగురాష్ట్ర ప్రజలకు సుపరిచితమయ్యారు

గుడ్ మార్నింగ్ ధర్మవరం' కార్యక్రమం ద్వారా ధర్మవరం వైసీపీ(YCP) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి(Kethireddy) తెలుగురాష్ట్ర ప్రజలకు సుపరిచితమయ్యారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలవుతుందని కొందరు ఊహించినా కానీ కేతిరెడ్డి ఓటమిని మాత్రం ఎవరూ ఊహించలేకపోయారు. స్వల్ప ఓట్లతో కేతిరెడ్డి కూడా ఓటమిపాలయ్యారు. పొద్దున లేస్తే గుడ్‌మార్నింగ్‌ ధర్మవరం(Good morning dharmavaram) కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించే కేతిరెడ్డి ఓటమి తెలుగురాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR) కూడా కేతిరెడ్డి ఓటమిపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేతిరెడ్డి కూడా అన్ని అవసరాలు ప్రజలకు దగ్గర ఉండి చూసుకోవద్దని తనకు అర్థమైందని.. ప్రజలు అడిగితేనే చేసిపెట్టాలని ఓటమి తర్వాత ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఆయన తాజాగా తిరుమల లడ్డూ(Tirumla laddu) వివాదంపై కూడా స్పందించారు. జగన్‌ తిరుమల వెళ్లి ప్రమాణం చేసి, ప్రెస్‌మీట్‌ పెట్టి లడ్డూ వివాదంపై విచారణ చేసుకోవాలంటూ చంద్రబాబుకు(Chandrababu) సవాల్ విసరాలని ఆయనకు కేతిరెడ్డి సూచించారు. పార్టీ మార్పుపై కూడా తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, 35 ఏళ్లుగా తమ కుటుంబం వైఎస్‌ కుటుంబంతోనే ఉంటోందని, ఇకపై కూడా జగన్‌ కుటుంబంతోనే ఉంటామన్నారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్‌తోనే ఉంటానని తెలిపారు. రాజకీయాలు పక్కన పెట్టి కేతిరెడ్డి కూడా కాసింత సేదతీరుతున్నట్లు కనిపిస్తోంది. యాంకర్‌, నటుడు ఓంకారు సోదరుడు అశ్విన్‌(Ashwin) బాబు నటిస్తోన్న ఓ సినిమా సెట్‌లో కేతిరెడ్డి ప్రత్యక్షమయ్యారు. సినిమా వివరాలు పూర్తిగా తెలియనప్పటికీ ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగానే సెట్‌లో ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది.

Eha Tv

Eha Tv

Next Story