వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్(Vellampalli Srinivas) కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల(YS Sharmila)పై కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల అంటే తమకు ఎంతో గౌరవం ఉందని.. తన అన్న జగన్(Jagan), వైసీపీ(YCP) పాలనపై ఆమె ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. దివంగత వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ పార్టీ(Congress Party) నమోదు చేయించిందని.. సోనియాగాంధీ(Sonia Gandhi)కి తెలియకుండానే వైఎస్సార్ పై కేసు పెట్టారా? అని ప్రశ్నించారు. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy)ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ఇప్పుడు షర్మిలను మోసం చేస్తోందని వెల్లంపల్లి ఆరోపించారు. జగన్ ను 16 నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఎలా చేరారని ప్రశ్నించారు. కాల్ మనీలు, గూండాయిజం, దొంగతనాలు, భూకబ్జాలు, బైక్ రేసులు చేసింది టీడీపీ నేతలే అని.. అందరి జీవితాలు బాగుండాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలని అన్నారు.

విజయవాడ సెంట్రల్ లో టీడీపీ నేత బొండా ఉమా(Bonda Uma) గెలవడం కలేనని వెల్లంపల్లి అన్నారు. ఇక్కడ పోటీ చేసే అర్హత కూడా ఉమాకు లేదని.. ఐదేళ్ల పాటు ప్రజలకు అందుబాటులో ఉమా లేరని అన్నారు. తుప్పు వ్యాపారం చేసే వాడికి ఇంత డబ్బు ఎలా వచ్చింది. బోండా ఉమా ఆఫీసు ఉన్న ప్రాంతంలోనే ఉమాకి మెజార్టీ రాదన్నారు వెల్లంపల్లి. చంద్రబాబు తోకలు ఎవరూ వచ్చే ఎన్నికల్లో గెలవరని అన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్.

Updated On 26 Jan 2024 10:26 AM GMT
Yagnik

Yagnik

Next Story