Former Minister Paritala Sunitha : చంద్రబాబు భద్రతపై అనుమానాలున్నాయి
చంద్రబాబు(Chandrababu) భద్రతపై(Security) అనుమానాలు ఉన్నాయని మాజీ మంత్రి పరిటాల సునీత(Former Minister Paritala Sunitha) వ్యాఖ్యానించారు. బుధవారం ‘‘బాబుతోనే నేను‘‘ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిటాల సునీత పాల్గొన్నారు. బళ్లారి(Ballari) రోడ్డులోని షిరిడీ సాయిబాబా ఆలయంలో వద్ద టీడీపీ రిలే(TDP Relay) దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సునీత మీడియాతో మాట్లాడుతూ నారా భువనేశ్వరి కూడా చంద్రబాబు భద్రతలో ఆందోళన వ్యక్తం చేశారు.

Former Minister Paritala Sunitha
చంద్రబాబు(Chandrababu) భద్రతపై(Security) అనుమానాలు ఉన్నాయని మాజీ మంత్రి పరిటాల సునీత(Former Minister Paritala Sunitha) వ్యాఖ్యానించారు. బుధవారం ‘‘బాబుతోనే నేను‘‘ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిటాల సునీత పాల్గొన్నారు. బళ్లారి(Ballari) రోడ్డులోని షిరిడీ సాయిబాబా ఆలయంలో వద్ద టీడీపీ రిలే(TDP Relay) దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సునీత మీడియాతో మాట్లాడుతూ నారా భువనేశ్వరి కూడా చంద్రబాబు భద్రతలో ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుపై కక్షతోనే నాలుగున్నర సంవత్సరాలుగా జగన్‌రెడ్డి వెంటాడుతున్నారు. ఇప్పుడు అక్రమ కేసులు పెట్టి ఆనందం పొందుతున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరీ(Bhuvaneswari) ఎప్పుడూ బయటకు వచ్చిన మహిళ కాదు. అలాంటి మహిళ చంద్రబాబు పరిస్థితిని చూసి కంటతడి పెట్టుకున్నారు. ఆయనకు జైల్లో చన్నీటి స్నానం ఏంటి. వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా. స్కిల్ డెవలప్మెంట్‌లో ఎలాంటి తప్పులేదని పీవీ రమేష్ స్వయంగా చెప్పారు.కేసులు ఉంటే ముందుగా ఐఏఎస్‌ల మీద ఉండాలి కదా. సీఐడీ వారు వాస్తవాలు గ్రహించాలి. జగన్ ఎప్పుడూ మీతోనే ఉండరు. జనంలో మీరు విశ్వసనీయత కోల్పోతున్నారు. చంద్రబాబు బయటకు వచ్చే వరకు మా పోరాటం ఆగదని పరిటాల సునీత పేర్కొన్నారు.
