Former Minister KS Jawahar : చంద్రబాబు మచ్చలేకుండా బయటకు వస్తారు
ఆంధ్రప్రదేశ్‌లో(andhra pradesh ) ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే ప్రజలు స్వచ్ఛందంగా బయటకు రావాలని మాజీమంత్రి కేఎస్ జవహర్(KS Jawahar) పిలుపునిచ్చారు. చంద్రబాబు(Chandrababu) చేస్తున్న యాగాన్ని భగ్నం చేయడానికి పోలీసులనుపయోగించి పెట్టిన స్కిల్ డెవలప్‌మెంట్(skill Development case) కేసు నుంచి..

Former Minister KS Jawahar
ఆంధ్రప్రదేశ్‌లో(andhra pradesh) ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే ప్రజలు స్వచ్ఛందంగా బయటకు రావాలని మాజీమంత్రి కేఎస్ జవహర్(KS Jawahar) పిలుపునిచ్చారు. చంద్రబాబు(Chandrababu) చేస్తున్న యాగాన్ని భగ్నం చేయడానికి పోలీసులనుపయోగించి పెట్టిన స్కిల్ డెవలప్‌మెంట్(skill Development case) కేసు నుంచి.. ఆయన మచ్చలేకుండా బయటకు వస్తారని.. దాంట్లో ఎటువంటి సందేహం లేదని అన్నారు. ప్రజలు, పార్టీ శ్రేణులందరూ సంయమనం పాటించవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే దాదాపుగా 13 మంది తెలుగుదేశం పార్టీ సైనికులను కోల్పోయామన్నారు. ఆందోళన తోనూ, గుండెపోటు తోనూ మరణిస్తున్న వారి కుటుంబాలు క్షోభ పడతాయి. దయచేసి ఎవరూ ఆందోళన చెందకండని సూచించారు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని.. ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకోవటానికి మనమంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణకై ప్రజలు నడుంబిగించడం ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడలేదన్నారు. నిరసన సమయాల్లో సంయమనం పాటిస్తూ కార్యక్రమాలను విజయవంతం చేయించాల్సిందిగా సూచించారు.
