వైసీపీ నేతల అక్రమాలను ప్రోత్సహించడంతోనే కలెక్టర్ పై ఈసీ వేటు వేసింద‌ని మాజీమంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కలెక్టర్ గా వచ్చిన నాటి నుండి అధికార పార్టీ నేతలకు కలెక్టర్ కొమ్ము కాశార‌ని ఆరోపించారు

వైసీపీ నేతల అక్రమాలను ప్రోత్సహించడంతోనే కలెక్టర్ పై ఈసీ వేటు వేసింద‌ని మాజీమంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కలెక్టర్ గా వచ్చిన నాటి నుండి అధికార పార్టీ నేతలకు కలెక్టర్ కొమ్ము కాశార‌ని ఆరోపించారు. తాము అనేకసార్లు ఫిర్యాదు చేసినా అక్రమాలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. వైసీపీ నేతలు జిల్లాలో పెద్ద ఎత్తున మట్టిని దోచుకున్నారని ఆరోపించారు. దొంగ ఓట్లపై ఎలక్షన్ కమిషన్ సిఫార్సులను కూడా చర్యలు తీసుకోలేదన్నారు. తప్పు చేసిన కొంత మంది అధికారులను సస్పెండ్ చేయమని ఆదేశించినా కలెక్టర్ పెడ చెవిన పెట్టారని.. మచిలీపట్నంలో MLA పేర్ని నాని పెద్ద ఎత్తున దొంగ పట్టాలు ఇచ్చారని.. దీనికి కూడా కలెక్టర్ సహకరించారే గానీ అక్రమాలను అడ్డుకోలేకపోయారన్నారు.

జిల్లా పోలీస్ శాఖను కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో ఎస్పీగా పని చేసిన జాషువా అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ నేతలతో అంటకాగి వాళ్లకు కావల్సిన విధంగా సీఐ, ఎస్ఐలను బదిలీ చేశారని.. మంత్రి జోగి రమేష్ ఒత్తిళ్లతో పెడన సర్కిల్ లో పని చేస్తున్న పోలీస్ సిబ్బందిని పెనమలూరుకు బదిలీ చేశారని అన్నారు. మచిలీపట్నంలో పేర్ని నాని అనుకూలమైన సిబ్బందిని బదిలీ చేయకుండా ఇక్కడే ఉంచేశారని ఆరోపించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో కొంత మంది వైసీపీ దొంగలు ఉన్నారని.. వారందరినీ ప్రక్షాళన చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న సీఐలు, ఎస్ఐలను పారదర్శకంగా బదిలీలు చేయాల్సి ఉందన్నారు. పోలీస్ శాఖ ప్రక్షాళనపై కూడా ఈసీ దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నామ‌న్నారు.

Updated On 3 April 2024 7:39 AM GMT
Yagnik

Yagnik

Next Story