Kollu Ravindra : వాలంటీర్లను వాడుకునేందుకే జగన్ రాజీనామాలు చేయిస్తున్నారు
వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలపై మాజీమంత్రి కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్ చేశారు. మూకుమ్మడి రాజీనామాలతో వాలంటీర్ల నిజస్వరూపం బయట పడిందన్నారు.

Former minister Kollu Ravindra Sensational comments on the resignations of volunteers
వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలపై మాజీమంత్రి కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్ చేశారు. మూకుమ్మడి రాజీనామాలతో వాలంటీర్ల నిజస్వరూపం బయట పడిందన్నారు. ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా వాలంటీర్లు వెళుతున్నారని అన్నారు. వాలంటీర్లను తొలగించమని ఈసీ చెప్పలేదు.. కేవలం పెన్షన్ల పంపిణీకి మాత్రమే వాలంటీర్లను దూరం పెట్టిందన్నారు. చంద్రబాబు కూడా వాలంటీర్లను కొనసాగిస్తామన్నారే గానీ తొలగిస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు.
కేవలం సీఎం జగన్ రాజకీయంగా వాలంటీర్లను వాడుకునేందుకు మూకుమ్మడి రాజీనామాలు చేయిస్తున్నారని ఆరోపించారు. రాజీనామాలు చేయాలని స్థానిక వైసీపీ నేతలు వాలంటీర్లపై ఒత్తిడి తెచ్చారని అన్నారు. ప్రత్యేక ఫార్మట్ తయారు చేసి ఆ ఫార్మట్ ప్రకారం రాజీనామాలు చేయిస్తున్నారని అన్నారు. వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించవద్దని అధికారులను కోరుతున్నాం.. ఈసీ కూడా దీనిపై దృష్టి పెట్టి మూకుమ్మడి రాజీనామాలకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
