Former Minister Kollu Ravindra : చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి వస్తారు
ఎందరో విద్యార్థులకు అండగా నిలిచిన స్కిల్ డెవలప్మెంట్ పథకాన్ని(Skill Development scheme) స్కామ్ గా చూపించి మా అధినేత చంద్రబాబు నాయుడుని(Chandrababu) అక్రమంగా అరెస్ట్ చేశారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా మచిలీపట్నం రైలుపేట సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు.

Former Minister Kollu Ravindra
ఎందరో విద్యార్థులకు అండగా నిలిచిన స్కిల్ డెవలప్మెంట్ పథకాన్ని(Skill Development scheme) స్కామ్ గా చూపించి మా అధినేత చంద్రబాబు నాయుడుని(Chandrababu) అక్రమంగా అరెస్ట్ చేశారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) అన్నారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా మచిలీపట్నం రైలుపేట సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్‌ను ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. లబ్ధి పొందిన ప్రతి ఒక్క విద్యార్థి ఈ రోజు పెద్ద యెత్తున రోడ్డుపైకి వస్తున్నారని అన్నారు. అవసరమైతే ఆ డబ్బులును మేమే కడతామని తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారని తెలిపారు.
ఏ రోజైతే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసావో ఆ రోజే నీ పతనం ప్రారంభమైంది జగన్ రెడ్డి.. నీ కొరవికి నువ్వే బాధ్యుడివయ్యావు అని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటికి వస్తారని అన్నారు. ఏ అధికారులతో అయితే చంద్రబాబుని నువ్వు అక్రమంగా అరెస్ట్ చేయించావో..
అదే అధికారులతో రాబోయే రోజుల్లో నిన్ను జైలు ఉచలు లెక్కపెట్టిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
