చంద్రబాబు అరెస్ట్(chandrababu Arrest) కు నిరసనగా మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌(Former minister Kollu Ravindra) ఆధ్వర్యంలో మ‌చిలీప‌ట్నం(Machilipatnam) నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ(TDP) కార్యాలయంలో నిరాహార దీక్ష చేప‌ట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వమే.. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తోందని అన్నారు. ఏపీలో 2019 నుంచే చీకటి రోజులు మొదలయ్యాయని..

చంద్రబాబు అరెస్ట్(chandrababu Arrest) కు నిరసనగా మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌(Former minister Kollu Ravindra) ఆధ్వర్యంలో మ‌చిలీప‌ట్నం(Machilipatnam) నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ(TDP) కార్యాలయంలో నిరాహార దీక్ష చేప‌ట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వమే.. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తోందని అన్నారు. ఏపీలో 2019 నుంచే చీకటి రోజులు మొదలయ్యాయని.. చంద్రబాబు అరెస్ట్ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని పేర్కొన్నారు.

వైసీపీకి(YCP) అనుబంధంగా సీఐడీ(CID), పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు. జైల్లో చంద్రబాబు పడుకోవడానికి కనీస వసతులు కూడా కల్పించడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రజల్లో తెలుగు దేశం పార్టీకి వస్తున్న ఆదరణ చూసి జగన్‌కు భయం పట్టుకుందని.. అందుకే ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే కుట్ర చేసి చంద్రబాబుని జైలుకు పంపారని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్ష సాధింపులే లక్ష్యంగా జగన్(Jagan) పనిచేస్తున్నారని విమ‌ర్శించారు.

జగన్ జైలుకు వెళ్లొచ్చారని.. అందరినీ జైలుకు పంపాలని కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు 45 ఏళ్లపాటు నిజాయతీగా ప్రజాసేవ చేసిన వ్యక్తి అని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల్లో ఎంతోమంది శిక్షణ పొందారని.. శిక్షణ పొందిన ఎంతోమంది యువత ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు.

చంద్రబాబు అరెస్టుతో ఏపీ ప్రజల్లో టీడీపీపై సానుభూతి పెరిగిందన్నారు. అవినీతి చేసినట్లు ఆధారాలుంటే చూపమనండి అంటే వైసీపీ ప్రభుత్వం పారిపోతుందని ఎద్దేవా చేశారు. సత్యాన్ని చంపేసి, ధర్మాన్ని చెరపట్టామని సంబరాలు చేసుకుంటున్నారని.. అంతిమంగా గెలిచేది సత్యమేనని.. వైసీపీ నేతలు తెలుసుకోవాలని సూచించారు.

జగన్ 16 నెలలు జైల్లో ఉన్నాడు, ఆయన అనుమానితుడు కదా? అని ప్ర‌శ్నించారు. జగన్ జైలుకు ఎందుకు పోయాడో సజ్జల చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే మంత్రులు, సజ్జల చర్చకు సిద్ధమా? అని స‌వాల్ విసిరారు. సీఐడీ ఈ స్కామ్ లో అధికారులను ఎందుకు చేర్చలేదు? అని ప్ర‌శ్నించారు. జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని మండిప‌డ్డారు.

చంద్రబాబుకు జైలులో ప్రాణహాని ఉందని అన్నారు. సీమెన్స్ కంపెనీ ఏపీ కంటే ముందు అనేక రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుందని పేర్కొన్నారు. మొదట సీమెన్స్ కంపెనీ గుజరాత్‍లో అగ్రిమెంట్ చేసుకుందని.. గుజరాత్‍లో 90 శాతం సిమెన్స్, 10 శాతం ప్రభుత్వ వాటా అని.. గుజరాత్ స్కిల్‍డెవలప్‍మెంట్ గురించి మోదీని ప్రశ్నించే ధైర్యం జగన్‍కు ఉందా? అని స‌వాల్ విసిరారు. ప్రపంచవ్యాప్తంగా సీమెన్స్ అనేక కంపెనీలకు సాప్ట్ వేర్‍ను అందిస్తుందని తెలిపారు.

ఏపీ స్కిల్ డెవలప్‍మెంట్ కార్పొరేషన్‍లో ఎలాంటి స్కామ్ జరగలేదని అన్నారు. స్కామ్ జరిగిందని చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరం అని స్కిల్ డెవలప్‍మెంట్ కేసుపై డిజెన్‍ టెక్ ఎండీ వివరణ కూడా వివరణ ఇచ్చారని.. చంద్రబాబును నేను ఎప్పుడూ కలవలేదు అన్నారని.. రెండు లక్షల మందికి స్కిల్ డెవలప్‍మెంట్ ట్రైనింగ్ ఇచ్చామన్నార‌ని.. స్కీమ్‍కు సంబంధించి వివరిస్తూ వీడియో రిలీజ్ కూడా చేసారని వివ‌రించారు.

అసలు ఒక్క మనిషి కూడా ఫిర్యాదు లేని కేసులో చంద్ర బాబుని జైలుకు పంపి వారి కక్ష సాధించుకున్నారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే పరిస్థితీ లేదన్నారు. ఇది ఆరంభం మాత్రమే.. నివురు గప్పిన నిప్పులా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వున్నారు. ఒక్క సారి మాలోని ఆవేశం కట్టలు తెంచుకుంటే.. వైసీపీ పార్టీ బంగాళా ఖాతంలో కలసి పోతుందని కొల్లు రవీంద్ర హెచ్చ‌రించారు.

Updated On 13 Sep 2023 2:49 AM GMT
Ehatv

Ehatv

Next Story