ఆంధ్రప్రదేశ్‌ బీజేపీకి(APBJP) కొత్త సారథి రాబోతున్నారా?

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీకి(APBJP) కొత్త సారథి రాబోతున్నారా? ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరిని(Daggubati purandeshwari) తొలగిస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు కాషాయం పార్టీ నేతలు! మరి పురంధేశ్వరి స్థానంలో ఎవరిని నియమించబోతున్నారంటే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డినట(Kiran Kumar reddy)! కిరణ్‌కుమార్‌కు బీజేపీ ఏపీ బాధ్యతలు అప్పగిస్తే రెడ్డి సామాజిక వర్గాన్ని కొంతలో కొంత ఆకర్షించవచ్చన్నది బీజేపీ అధినాయకత్వం భావన. కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆల్‌రెడీ కేంద్ర నాయకత్వం నుంచి సంకేతాలు వచ్చాయట! ఇంకా ఆయన చేతికి పగ్గాలు రాకమునుపే కొంతమంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులతో చర్చలు జరుపుతున్నారట! బీజేపీలోకి వస్తే తగిన ప్రాధాన్యం ఉంటుందని, కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి పనులు కావాలంటే జరిపించుకోవచ్చని కిరణ్‌ వారితో చెబుతున్నారట! కిరణ్‌కుమార్‌రెడ్డిని నమ్మి బీజేపీలోకి వెళ్లడానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు సిద్ధంగా లేరని ఇన్‌సైడ్‌ టాక్‌! నిజానికి కిరణ్‌కుమార్‌ రెడ్డి పేరు ఎన్నికలకు ముందే వినిపించింది. అప్పుడెందుకో అధినాయకత్వం నిర్ణయం తీసుకోలేదు. పురంధేశ్వరినే పదవిలో కొనసాగించారు. మొన్నటి ఎన్నికల్లో రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డికి పరాజయమే ఎదురయ్యింది. రాజమండ్రి లోక్‌సభకు పోటీ చేసిన పురంధేశ్వరి మాత్రం విజయం సాధించారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు దొరుకుతుందని పురంధేశ్వరి గట్టిగా అనుకున్నారు కానీ ఆమె ఆశలు ఫలించలేదు.

Eha Tv

Eha Tv

Next Story