కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి(Killi Kriparani) పేరు విని చాన్నాళ్లయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె వార్తల్లోకి వచ్చారు. అటు తిరిగి ఇటు తిరిగి ఆమె సొంత గూటికి చేరుకుంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌(Congress) పార్టీ నాయకురాలైన కృపారాణి 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్‌ పార్టీనే కారణమన్న భావన ఏపీ ప్రజలలో ఉండింది కాబట్టి ఆమెకు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి.

కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి(Killi Kriparani) పేరు విని చాన్నాళ్లయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె వార్తల్లోకి వచ్చారు. అటు తిరిగి ఇటు తిరిగి ఆమె సొంత గూటికి చేరుకుంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌(Congress) పార్టీ నాయకురాలైన కృపారాణి 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్‌ పార్టీనే కారణమన్న భావన ఏపీ ప్రజలలో ఉండింది కాబట్టి ఆమెకు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. అంతకు ముందు ఎన్నికల్లో అంటే 2009లో జరిగిన ఎన్నికల్లో ఇదే కృపారాణి తెలుగుదేశంపార్టీ నేత ఎర్రన్నాయుడును ఓడించి జాయింట్ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్నారు. అప్పటి యూపీఏ ప్రభుత్వంలో కృపారాణి కమ్యూనికేషన్స్‌ శాఖ సహాయమంత్రిగా పని చేశారు. 2014 ఎన్నికలకు ముందు ఆమెను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆహ్వానించినప్పటికీ ఆమె నో చెప్పారు. 2019లో మాత్రం తనంతట తానుగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో(YSR congress) చేరారు. అయితే అప్పటికే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులను ఖరారు చేసింది. కాబట్టి ఆమెకు టికెట్ దొరకలేదు. కాకపోతే అధికాంలోకి వస్తే ఏదో ఒక పదవి ఇస్తామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కృపారాణి జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా పని చేశారు. రాజ్యసభ స్థానాన్ని ఆశించారు కానీ అధిష్టానం కాదనేసింది. జిల్లాలో పార్టీని పటిష్ంచేయలేదని, జిల్లా నేతలను కలుపుకుని పోలేదని భావించిన పార్టీ అధిష్టానం ఆమె స్థానంలో ధర్మాన కృష్ణదాస్‌ను నియమించింది. దాంతో ఆమె అసంతృప్తితో రగిలిపోయారు. తర్వాత ఆమె టెక్కలి అసెంబ్లీ సీటును అడిగారు. కానీ పార్టీ అధినాయకత్వం మాత్రం ఆమెను శ్రీకాకుళం లోక్‌సభకు పోటీ చేయించాలని అనుకుంది. కారణాలేమిటో తెలియదు కానీ ఆమెకు ఇటు శ్రీకాకుళం ఎంపీ టికెట్‌ దొరకలేదు. అటు టెక్కలి అసెంబ్లీ సీటు దక్కలేదు. దాంతో ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారు. ఆ మధ్యన కిల్లి కృపారాణి తెలుగుదేశం పార్టీలో చేరతారనే వార్తలు వినిపించాయి. అయితే తెలుగుదేశం పార్టీలో కూడా ఆమెకు కోరుకున్న సీట్లు దొరకడం కష్టమే! అందుకే ఆమె కాంగ్రెస్‌లో చేరాలని డిసైడయ్యారు. ఇటీవల ఆమె ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలుసుకున్నారని, తొందరలోనే కాంగ్రెస్‌లో చేరతారని అంటున్నారు. కాంగ్రెస్‌ తరఫున శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేస్తారని చెబుతున్నారు.

Updated On 2 April 2024 3:49 AM GMT
Ehatv

Ehatv

Next Story