జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌కు(Pawan kalyan) పార్లమెంట్‌ మాజీ సభ్యుడు, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరి రామజోగయ్య(Hari Ramajogaiah ) ఓ బహిరంగ లేఖ(Letter) రాశారు. యాచించే స్థితిని పవన్‌కల్యాణ్‌ నుంచి జనసైనికులు కోరుకోవడం లేదని, రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని లేఖ ద్వారా జనసేనానికి చురకలు అంటించారు. తెలుగుదేశంపార్టీ(TDP) జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) వ్యాఖ్యల నేపథ్యంలో పవన్‌కు పలు ప్రశ్నలను సంధించారు హరి రామజోగయ్య.

జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌కు(Pawan kalyan) పార్లమెంట్‌ మాజీ సభ్యుడు, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరి రామజోగయ్య(Hari Ramajogaiah ) ఓ బహిరంగ లేఖ(Letter) రాశారు. యాచించే స్థితిని పవన్‌కల్యాణ్‌ నుంచి జనసైనికులు కోరుకోవడం లేదని, రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని లేఖ ద్వారా జనసేనానికి చురకలు అంటించారు. తెలుగుదేశంపార్టీ(TDP) జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) వ్యాఖ్యల నేపథ్యంలో పవన్‌కు పలు ప్రశ్నలను సంధించారు హరి రామజోగయ్య. రాబోయే కాలంలో చంద్రబాబునాయుడు(Chandrababu) నాయకత్వాన్ని పవన్‌ నిజం సమర్థిస్తున్నారా? ఒకవేళ సమర్థిస్తే బడుగు బలహీనవర్గాల పరిస్థితి ఏమిటని పవన్‌ను నిలదీశారు హరిరామజోగయ్య. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన నాటి నుంచి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండే రెండు కుల నాయకులు రాజ్యమేలుతున్నారని, 80 శాతం జనాభా ఉన్న బడుగు బలహీనవర్గాలకు మోక్షం ఎప్పుడని ప్రశ్నించారు. మిమ్మల్ని నమ్ముకున్నవాళ్లు, మీ నుంచి ఏదో ఆశిస్తున్నవాళ్లు.. మీ వైఖరి ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారని, ఆ వైఖరిని స్పష్టంగా అందరికీ అర్థం అయ్యేట్లు చెప్పాలని అని లేఖలో హరిరామజోగయ్య అడిగారు. ఇదిలా ఉంటే, రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి నాయకత్వమే కావాలంటూ పవన్‌ కల్యాణ్‌ అనేకసార్లు ప్రస్తావించిన మాటను కూడా లేఖ ద్వారా హరిరామజోగయ్య ప్రస్తావించారు. అధికారం చేపట్టి.. బలహీనవర్గాలను శాసించే స్థితికి మీరు(పవన్‌కల్యాణ్‌) తెస్తారని జన సైనికులు కలలు కంటున్నారని, ఆ కలలు ఏం కావాలని కోరుకుంటున్నారో పవన్‌ కల్యాణ్‌ చెప్పాల్సిన అవసరం ఉందని లేఖ ద్వారా హరిరామజోగయ్య అడిగారు.

Updated On 22 Dec 2023 6:04 AM GMT
Ehatv

Ehatv

Next Story