వైసీపీ పార్టీ అధికారంలోకి రావటానికి ఎన్ని తప్పుడు కథనాలు, రాతలు రాయాలో అన్నీ రాసి అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

వైసీపీ పార్టీ అధికారంలోకి రావటానికి ఎన్ని తప్పుడు కథనాలు, రాతలు రాయాలో అన్నీ రాసి అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. వచ్చిన ఐదేళ్లలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్, సెంటు పట్టాల్లో అడ్డగోలుగా చేసిన ఎనిమిది లక్షల కోట్ల దోపిడీపై తెలుగుదేశం పార్టీ చార్జి షీటు వేసిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే దోచిన ఎనిమిది లక్షల కోట్లను ప్రభుత్వ ఖజానాకు రప్పిస్తామ‌న్నారు. ఎన్నికల ముందు ఆరు లక్షల పద్నాలుగు వేల కోట్ల అభివృద్ధి చేశామని.. అబద్ధపు అసత్యపు ఆరోపణలతో కానుక పుస్తకాలు విడుదల చేశారు.. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచుకుని 38 క్రిమినల్ కేసుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి దారుణాల‌ను.. తెలుగుదేశం పార్టీ ఆధారాలతో సహా యటపెట్టిందన్నారు.

ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ఐదేళ్లపాటు అధికారంలో ఉండి చేయటం చేతకాక మా మీద మహాదోపిడి అని పుస్తకాలు వేశారంటే ప్రభుత్వానికి బుద్ధి ఉందా లేదా? అని ప్ర‌శ్నించారు. తెలుగుదేశం పార్టీపై ఒక్క ఆరోపణ నిరూపితం చేయలేకుండా మళ్ళీ సిగ్గు లేకుండా పుస్తకాలు వేస్తున్నారంటే మీ మానసిక పరిస్థితి దేనికి అద్దం పడుతుందని అడిగారు.

దేశం మెచ్చుకునే మేధావి అటువంటి జాతి సంపద చంద్రబాబు మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు పుస్తకాలు జగన్మోహన్ రెడ్డి వేస్తున్నాడు. ఐదేళ్లుగా స్క్రిప్ట్ లు చదువుతూ పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపట్నం, రెవిన్యూ కుంభకోణాలు అంటూ మా మీద ఆరు లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు చేశారు. ఈ ఐదేళ్లలో ఒక్కటైన నిరూపితం చేశారా? గాడిదలు కాస్తున్నారా? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారా? జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

హిట్లర్ అనే జగన్.. గోబెల్స్‌ అనే సజ్జల రామకృష్ణారెడ్డితో బురద జల్లిస్తున్నాడ‌ని ఆరోపించారు. కేంద్ర జలవనరుల శాఖ అఫిడవిట్ తో పోలవరంలో ఎటువంటి అవకతవకలు లేవని బట్టబయలు అయ్యాయి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి దాడి చేసే కార్యక్రమాలు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. వందల కోట్ల ప్రజల ధనాన్ని దుర్వినియోగ పరుస్తూ పుస్తకాలు ప్రజలకు పంపి తప్పుదోవ పట్టించడానికి కిరాయి రచయిత విజయబాబుతో అబద్ధపు రాతలు రాపిస్తున్నాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఎన్నికల నియమావళి ఉల్లంఘ‌నకు పాల్పడ్డ విజయ్ బాబు, సజ్జల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను కోరారు. జలవనరుల శాఖలో 62,838 కోట్లు ఖర్చుపెడితే 56,700 కోట్లు దోపిడీ అయ్యాయా.? ఎంత బుద్ధి లేకుండా.. బుర్ర లేకుండా రచయితలు మీరు కలిసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో అర్థమవుతుందన్నారు.

ప్యాలెస్ లు కట్టి ఎదుటి వ్యక్తుల మీద ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్న 16 కు తోడు మరో 56 సూట్ కేసు పంపిణీలు పెట్టాడని ఆరోపించారు. బుల్లెట్టు దిగుతుంది అన్నవాడు అడ్రస్ లేకుండా పోయాడు.. సంబరాల రాంబాబు డాన్సులు వేసుకునే పనిలో పడిపోయాడు. 2024 వచ్చినా ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో కూడా చెప్పలేకపోయార‌న్నారు.

670 అవార్డులు జలవనరుల శాఖకు వస్తే వాటన్నింటిపై బురద జల్లుతున్నారని మండిప‌డ్డారు. జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన సీబీఐ, ఈడీ కేసుల్లో 3,700 సార్లు వాయిదాలు తీసుకుని కోర్టుకు వెళ్లకుండా ఎగ్గొట్టాడని దుయ్య‌బ‌ట్టారు.

ఇరిగేషన్ ప్రాజెక్టులపై, మీ అవినీతిపై బహిరంగ చర్చకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది టైము ప్లేస్ చెప్పండని స‌వాల్ విసిరారు. కృష్ణ, గోదావరి పవిత్ర సంగమం దాన్ని కూడా దెబ్బతీసి, అక్కడ అసాంఘిక శక్తులు బీరు బాటిల్స్‌ దర్శనమిస్తున్నాయన్నారు. రూ.4,900 కోట్లు మంజూరైన‌ చింతలపూడి ఎత్తిపోతల పథకంలో రూ.4,100 ఖర్చు.. పెట్టబడి ఇంకా 10 శాతం పనులు చేయాల్సి ఉంటే దాన్ని కూడా నాశనం చేశారన్నారు. జరగబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలోకి విసిరేసి 161 అడుగుల గోతిలో ప్రజలు కప్పి పెడతారన్నారు.

Updated On 21 March 2024 10:13 PM GMT
Yagnik

Yagnik

Next Story