Bandaru Satyanarayanamurthy Arrest : మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అరెస్ట్
మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులలో బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Former minister Bandaru Satyanarayanamurthy arrested
మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి(Bandaru Satyanarayanamurthy)ని పోలీసులు(Police) అరెస్ట్(Arrest) చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్(YS Jagan), మంత్రి రోజా(Minister Roja)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులలో బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం జగన్, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విషయమై నోటీసులు ఇచ్చేందుకు సోమవారం ఉదయం నుండి బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్ద పోలీసులు ప్రయత్నించారు. టీడీపీ కార్యకర్తలు(TDP workers) పోలీసులను ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు.
పోలీసులు సాయంత్రం ఎట్టకేలకు బండారు సత్యనారాయణమూర్తి ఇంట్లోకి వెళ్లారు. అయితే.. నోటీసులు తీసుకోకుండా తలుపులు వేసుకొని బండారు సత్యనారాయణమూర్తి నిరసనకు దిగారు. తలుపులు తోసుకుని వెళ్లి మంత్రికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
