balineni Srinivas reddy : వైసీపీకి బాలినేని గుడ్‌బై
వైసీపీకి(YCP) మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి(Balineni Srinivas reddy) గుడ్‌బై చెప్పారు.
వైసీపీకి(YCP) మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి(Balineni Srinivas reddy) గుడ్‌బై చెప్పారు. వైసీపీ అధినేత జగన్‌కు(YS Jagan) తన రాజీనామా లేఖను పంపించారు. గత కొంత కాలంగా పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న బాలినేని.. పార్టీని వీడుతున్నారని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాడుతున్న తనకు కనీసం నైతిక మద్దతు ఇవ్వలేదని బాలినేని అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జగన్‌ను కూడా బాలినేని కలిశారు. అయితే జగన్‌తో బాలినేని భేటీ సంతృప్తికరంగా జరగలేదు. గత ఎన్నికల్లో ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాస్‌రెడ్డికి ఎంపీ టికెట్ కోరినా ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందారు. మాగుంట శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ దక్కకపోవడంతో ఆయన టీడీపీలో చేరి ఎంపీగా గెలిచారు. ఒకవేళ మాగుంటకు వైసీపీ టికెట్ ఇచ్చి ఉంటే తాను కూడా ఎమ్మెల్యేగా గెలిచేవాడనన్న యోచనలో బాలినేనిలో ఉంది. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కూడా సంత్సంబంధాలు లేకపోవడంతో పార్టీ కార్యకలాపాలకు బాలినేని దూరంగా ఉంటున్నారు. బాలినేని పార్టీని వీడుతారన్న వార్తలు నిజమేనని నేటితో తేలిపోయింది. రాజీనామా లేఖను జగన్‌కు పంపిస్తూ కొన్ని కారణాల వల్ల వైసీపీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. రాష్ట్రం ప్రగతిపథంలో నడిస్తే కచ్చితంగా అభినందిస్తానన్నారు. విలువలకు కట్టుబడి రాజకీయాలు చేయాలని.. విలువలతోనే ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేశానన్నారు. రాజకీయాల్లో హుందాగా ఉండాలని హుందాగా మాట్లాడాలని ఆయన సూచించారు. రాజకీయాల్లో లక్షల మంది కార్యకర్తలు మనల్ని స్ఫూర్తిగా తీసుకుంటారని.. అన్ని విలువలను కాపాడాల్సిన బాధ్యత మనేదనని ఆయన లేఖలో పేర్కొన్నారు.