స్కిల్ డెవలప్ మెంట్ కేసు(Skill development) నిరాధారమైనదని సిమెన్స్ కంపెనీ(Siemens Company) మాజీ ఎండి సుమన్ బోస్(Suman Bose) అన్నారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. బిల్డ్ ఆపరేట్.. ట్రాన్స్ ఫర్ ఆపరేట్ పద్దతిలో ఈ ప్రాజెక్ట్ నడిచిందని తెలిపారు. ఇప్పుడు ఆరోపిస్తున్న ఆరోపణ‌లు అన్ని అబద్దాలే.. అక్రమాలు జరిగాయనేది అబద్దం అని అన్నారు. 2021 వరకు స్కిల్ డెవ‌లప్‌మెంట్ ద్వారా 2.13లక్షల మందికి శిక్షణ ఇచ్చామ‌ని తెలిపారు. అనంతరం 2021లోనే శిక్షణ కేంద్రాలను పూర్తిగా ఏపీ ప్రభుత్వానికి అప్పగించామ‌ని వివ‌రించారు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసు(Skill development) నిరాధారమైనదని సిమెన్స్ కంపెనీ(Siemens Company) మాజీ ఎండి సుమన్ బోస్(Suman Bose) అన్నారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. బిల్డ్ ఆపరేట్.. ట్రాన్స్ ఫర్ ఆపరేట్ పద్దతిలో ఈ ప్రాజెక్ట్ నడిచిందని తెలిపారు. ఇప్పుడు ఆరోపిస్తున్న ఆరోపణ‌లు అన్ని అబద్దాలే.. అక్రమాలు జరిగాయనేది అబద్దం అని అన్నారు. 2021 వరకు స్కిల్ డెవ‌లప్‌మెంట్ ద్వారా 2.13లక్షల మందికి శిక్షణ ఇచ్చామ‌ని తెలిపారు. అనంతరం 2021లోనే శిక్షణ కేంద్రాలను పూర్తిగా ఏపీ ప్రభుత్వానికి అప్పగించామ‌ని వివ‌రించారు. ఏపీఎస్ఎస్‌డీసీలో ఏం జరిగిందో నాకు తెలియదన్నారు. గతంలో మెచ్చుకున్న ఏపీఎస్ఎస్‌డీసీనే ఈ ప్రాజెక్ట్ బోగస్ అని ఆరోపించిందన్నారు. శిక్షణ కేంద్రాలను చూడకుండా.. పరిశీలించకుండా.. అక్రమాలు జరిగాయని ఆరోపించారని అన్నారు. ఒక్క కేంధ్రం సందర్శించలేదు.. తనిఖీ జరగలేదు.. ఇలా ఎందుకు జరిగిందన్నది పెద్ద మిస్టరీ. ఒక హత్య జరిగిందని విచారణ చేయాలంటున్నారు. విచిత్రంగా హత్యకు గురైనట్లు చెబుతున్న వ్యక్తి బతికే ఉన్నాడు. బతికుండగానే హత్య జరిగిందని విచారణ చేస్తామంటున్నారని అన్నారు.

2018లోనే ఈ ప్రాజెక్ట్ నుండి నేను బయటకు వెల్లిపోయానని తెలిపారు. 2021 తరువాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయని అన్నారు. స్కిల్ ప్రాజెక్ట్ చాలా విజయవంతమైన ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. 2016లో చాలా విజయవంతమైన ప్రాజెక్ట్ నమూనాగా కేంద్రం ప్రకటించిందని తెలిపారు. ప్రాజెక్ట్ అందించిన అంతిమ ఫలితాలు చూసి మాట్లాడాలని సూచించారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఫలితాలు మన కళ్లముందే ఉన్నాయని అన్నారు. ఈ ప్రాజెక్ట్ 100శాతం విజయవంతమైందని.. ఈ ప్రాజెక్ట్ లో ఏమాత్రం అవినీతి జరగలేదని అన్నారు. అన్నీ అధ్యయనం చేశాకే ఈ ప్రాజెక్టు ప్రారంభించామ‌ని తెలిపారు.

ప్రాజెక్టులో అధిక భాగం సీమెన్స్ నుంచి డిస్కౌంట్స్ రూపంలో అందిందని పేర్కొన్నారు. డిస్కౌంట్స్ లో అవినీతి సాధ్యమని ఎలా చెబుతారు? అని ప్ర‌శ్నించారు. సీమెన్స్ తో ఒప్పందం జరగలేదనడం పూర్తి అబద్దం అని అన్నారు. ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఏపీ స్కిల్ డెవలప్‍మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వంలో భాగం కాదా? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. ఏలాంటి మనీలాండరింగ్ జరగలేదని అన్నారు. కోర్టుల పరిధిలో ఉన్నందున కోర్టులకు అన్ని విషయాలు చెబుతామ‌న్నారు. ముగ్గురి మధ్య జరిగిన ట్రైపార్టీ ఒప్పందం అని వివ‌రించారు. సీమెన్స్ పై చేస్తున్న ఆరోపణలు అన్నీ బోగస్ అన్నారు. ఇదే తరహా ప్రాజెక్టు చాలా రాష్ట్రాల్లో అమలు చేశాం.. చేస్తున్నాం.. అని వివ‌రించారు.

కియా మోటర్స్ మానవ వనరులకు పూర్తి శిక్షణ ఇచ్చామ‌ని తెలిపారు. గొప్పగా శిక్షణ ఇవ్వడంపై కియా సంస్థ ఆశ్చర్యం వ్యక్తం చేసిందన్నారు. రూ.321 కోట్ల ప్రాజెక్టులో రూ.10 కోట్లు మాత్ర‌మే సీమెన్స్ కు వచ్చింది. ఒప్పందంలో పేర్కొన్న మొత్తం డిజైన్ టెక్ సంస్థ ఖాతాకు వెళ్లిందని వివ‌రించారు. డిజైన్ టెక్ సంస్థ అందరికీ నిధులు విడుదల చేసిందని తెలిపారు. సీమెన్స్ లో ప్రాజెక్టు అప్రూవల్‍కు సంబంధించి అన్ని పత్రాలు ఉన్నాయ‌ని తెలిపారు. తేదీల్లో మార్పులున్నాయి అనడంలో వాస్తవాలు లేవన్నారు. అందరం ఒకేసారి ఒప్పందంపై సంతకాలు చేశామ‌ని.. ఆ రోజు విద్యుత్ పోతే.. కొవ్వొత్తులు పెట్టుకుని చేశామ‌ని తెలిపారు. ఇప్పటివర‌కూ చేస్తున్న ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా చూపలేదని.. ఇలాంటి ఆరోపణలు పలువురి జీవితాలపై ప్రభావం చూపుతాయని సుమన్ బోస్ అన్నారు.

Updated On 17 Sep 2023 3:00 AM GMT
Ehatv

Ehatv

Next Story