ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) మరో రాజకీయపార్టీ అవతరించింది. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌ కుమార్‌(Vijay Kumar) ఆధ్వర్యంలో నూతన పార్టీ రూపుదిద్దుకుంది. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న ప్రాంతంలో అధిక జన మహా సంకల్ప సభ(Public Meeting) నిర్వహించారు. ఈ సభలో విజయ్ కొత్త రాజకీయ పార్టీ ప్రకటన చేశారు. పార్టీకి లిబరేషన్ కాంగ్రెస్‌(Liberation congress) పేరు పెట్టారు.

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) మరో రాజకీయపార్టీ అవతరించింది. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌ కుమార్‌(Vijay Kumar) ఆధ్వర్యంలో నూతన పార్టీ రూపుదిద్దుకుంది. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న ప్రాంతంలో అధిక జన మహా సంకల్ప సభ(Public Meeting) నిర్వహించారు. ఈ సభలో విజయ్ కొత్త రాజకీయ పార్టీ ప్రకటన చేశారు. పార్టీకి లిబరేషన్ కాంగ్రెస్‌(Liberation congress) పేరు పెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌పై(CM Jagan) విమర్శలు చేశారు. పేదల కోసం యుద్ధం చేస్తానని అంటున్న జగన్‌ పెత్తందార్లు దోచుకున్న భూములను పేదలకు ఇచ్చి నిజాయితీ చాటుకోవాలని చెప్పారు. దౌర్జన్యంగా లాక్కున్న వారికి ఆస్తులు(Assests) చెందేలా జగన్‌ ప్రభుత్వం చట్టాన్ని మార్చిందని, సర్వే చేయించి అసలైన లబ్ధిదారులకు భూములు ఇవ్వాలని విజయ్‌కుమార్‌ డిమాండ్ చేశారు. ఆసుపత్రులకు వెళ్లలేక గిరిజన మహిళలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం విజయ్‌ కీలకంగా పని చేశారు. చాలా సందర్భాలలో జగన్‌ను ప్రశంసించారు. దీంతో విజయ్‌కుమార్ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని, ప్రకాశం జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అనుకున్నారు చాలా మంది. ఈ క్రమంలో ఆయన పాదయాత్ర కూడా చేపట్టారు.

విజయ్‌ కుమార్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమేనని అనుకుంటున్న సమయంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. విజయ్‌ పోటీ చేద్దామని అనుకుంటున్న నియోజకవర్గానికి వైసీపీ కొత్త అభ్యర్థిని ప్రకటించింది. దీంతో విజయ్‌ కొత్త పార్టీని ప్రకటించారు. నిజానికి జగన్‌కు విజయ్‌ కుమార్‌ ఆప్తులు. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ, కొత్త జిల్లాల ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. విద్యాశాఖతోపాటు అనేక శాఖల్లో పనిచేసి తనదైన ముద్ర వేసుకున్నారు. అలాగే విజయ్ కుమార్ నెల్లూరు, ఒంగోలు, కృష్ణా జిల్లాలకు కలెక్టర్‌గా గతంలో పనిచేసినప్పుడు తనదైన మార్క్ చూపించారు. విధులకు దూరమయ్యాక కూడా దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఐక్యతా విజయపథంతో పేరుతో విజయ్‌ కుమార్ పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకున్నారు. గత ఏడాది జులై 23న తిరుపతి జిల్లా తడ నుంచి పాదయాత్ర ప్రారంభించిన విజయ్‌కుమార్‌ కాకినాడ జిల్లా తుని వరకు 2,729 కిలోమీటర్ల మేర నడిచారు. 147 రోజుల్లో 1250 గ్రామాలు, పట్టణాల్లో పర్యటించి లక్షల మందిని కలిసి నిరుపేదల సమస్యలపై అధ్యయనం చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ వర్గాల పేదలకు స్వేచ్ఛ కరువయ్యిందని విజయ్‌కుమార్‌ ఆవేదన చెందుతున్నారు. వారి అభ్యున్నతి కోసం పోరాటం సాగిస్తానని చెప్పారు.

Updated On 15 Feb 2024 2:15 AM GMT
Ehatv

Ehatv

Next Story