VG Venkata Reddy : గనుల శాఖ మాజీ డైరెక్టర్ అరెస్ట్..
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) తెలుగుదేశంపార్టీ(TDP) నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చీరాగానే గత ప్రభుత్వానికి దగ్గరగా పని చేసిన అధికారులను లక్ష్యంగా చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) తెలుగుదేశంపార్టీ(TDP) నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చీరాగానే గత ప్రభుత్వానికి దగ్గరగా పని చేసిన అధికారులను లక్ష్యంగా చేసుకుంది. వారికి ఎలాంటి పదవులు ఇవ్వకుండా, అవినీతికి(Corruption) సంబంధించిన కారణాలతో అరెస్ట్‌లు కూడా చేస్తోంది. లేటెస్ట్‌గా ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వి.జి.వెంకటరెడ్డిని(VG Venkata Reddy) ఏసీబీ(ACB) అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసిన అధికారులు, ఇవాళ విజయవాడ కోర్టులో హాజరు పరచనున్నారు. గత ప్రభుత్వంలో గనుల శాఖలో టెండర్లు, ఒప్పందాలు, ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపై అభియోగాలు ఉననాయి. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయినా ఈ అధికారి ప్రభుత్వ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేశారు. వెంకటరెడ్డితో పాటు, మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించిన మూడు సంస్థలపై కూడా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం ఏడుగురిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. చిత్రమేమిటంటే ఓ పది రోజుల కిందట తెలుగుదేశంపార్టీ అనుకూల మీడియా ఇదే వెంకటరెడ్డి గురించి రాస్తూ ఆయన విదేశాలకు పారిపోయాడని అన్నాయి. ఎక్కడ్నుంచి ఎలా పారిపోయారో కూడా ప్రత్యక్షంగా చూసినట్టుగానే రాశాయి. విదేశాలకు పారిపోయిన వెంకటరెడ్డిని హైదరాబాద్‌లో ఎలా అరెస్ట్ చేసినట్టు?