YS Jagan Warning : పోలీసులూ జాగ్రత్త..! జగన్ సీరియస్ వార్నింగ్..!
సుప్రీంకోర్టు(Supreme court) ఆదేశాలున్నా నిబంధనలు అతిక్రమించిన పోలీసులు అరెస్టు చేస్తున్నారని జగన్ అన్నారు.
సుప్రీంకోర్టు(Supreme court) ఆదేశాలున్నా నిబంధనలు అతిక్రమించిన పోలీసులు అరెస్టు చేస్తున్నారని జగన్ అన్నారు. పోలీసులు తమ మనఃస్సాక్షికి అనుగుణంగా పనిచేయాలన్నారు. కూటమి(TDP)(Janasena) ప్రభుత్వం ఆదేశాలానుసారం పనిచేస్తున్న డీజీపీ, పోలీసులను(Police) హెచ్చరిస్తున్నాని జగన్(YS Jagan) అన్నారు. మూడు సింహాలకు సెల్యూట్ చేయాల్సిన పోలీసులు అక్రమ అరెస్టులు(arrest) చేస్తున్నారన్నారు. అధికారపార్టీ నేతలు చెప్తున్నారని అక్రమ అరెస్టులు చేసి హింసిస్తున్నవారి ఉసురుతగులుతుందన్నారు. పోలీసులు చేస్తున్న పనుల వల్ల డిపార్ట్‌మెంట్ పరువు పోతుందన్నారు. డీజీపీ అధికార పార్టీ కార్యకర్తలా మాట్లాడుతున్నారన్నారు. వన్‌సైడ్‌గా ఉండకుండా వ్యవస్థమీద గౌరవంతో ఉండాలన్నారు. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తే వైసీపీ లీగల్ టీమ్ న్యాయ సలహా ఇస్తుందన్నారు. జమిలి.. గిమిలి ఎన్నికలంటున్నారు. ఈ ప్రభుత్వం మళ్లీ వచ్చే అవకాశం లేదు.. మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే. అప్పటికీ రిటైర్డ్ అవుతాం.. వెళ్లిపోతామనుకుంటున్నారు. ఎవరినీ వదిలిపెట్టం. సప్త సముద్రాల అవతల ఉన్నా.. వారిని వదిలిపెట్టేదిలేదని జగన్ వార్నింగ్(Jagan warning) ఇచ్చారు. బాధితులు కూడా రెడ్‌బుక్(Red book) పెట్టుకుంటారని.. ఇప్పుడు అతి చేస్తున్న పోలీసులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.