ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ హై కోర్టును ఆశ్రయించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ హై కోర్టును ఆశ్రయించారు. గతంలో తనకు ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని వైఎస్ జగన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కోరారు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా లేదని పిటిషన్‌లో తెలిపారు. కూటమి ప్రభుత్వం తన సెక్యూరిటీ విషయంలో తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదన్నారు. తనను అంతమొందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వైఎస్ జగన్ ఆరోపించారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వైఎస్సార్‌సీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావుపై జరిగిన దాడిని వైసీపీ ఖండించింది. రేపు సాయంత్రం బెంగళూరు నుంచి గన్నవరం చేరుకోనున్న వైఎస్ జగన్ నేరుగా విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావును పరామర్శించనున్నారు. బుధ, గురువారాల్లో వరుసగా ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు.