తిరుప‌తి అలిపిరి నడకమార్గం ఏడోవ మైలు వద్ద మూడేళ్ల బాలుడుపై గురువారం రాత్రి చిరుత దాడి చేసిన ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఈ విష‌య‌మై టీటీడీ, ఫారెస్ట్ అధికారులు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

తిరుప‌తి(Tirupati) అలిపిరి(Alipiri) నడకమార్గం ఏడోవ మైలు వద్ద మూడేళ్ల బాలుడు(Boy)పై గురువారం రాత్రి చిరుత(Leopard) దాడి చేసిన ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఈ విష‌య‌మై టీటీడీ(TTD), ఫారెస్ట్ అధికారులు(Forest officials) వెంట‌నే అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. అందులో భాగంగానే నిన్న సాయంత్రం చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు రెండు ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు. వాటితో పాటు.. 30 కెమెరా ట్రక్స్(Camera Trucks) కూడా ఏర్పాటు చేశారు అటవీశాఖ అధికారులు. అటవీశాఖ అధికారుల ప్ర‌య‌త్నం ఫ‌లించింది. నిన్న రాత్రి 10:45 గంటలకు చిరుత బోన్ లో పడినట్లు సమాచారం. ఒక్క రోజు వ్యవధిలోనే చిరుతను బంధించడంపై టీటీడీ, అటవీ శాఖా అధికారులను భక్తులు(Devotees) అభినందిస్తున్నారు.

Updated On 23 Jun 2023 10:55 PM GMT
Yagnik

Yagnik

Next Story