ప్రకాశం బ్యారేజ్‌(Prakasam Barrege)కు ఎన్నడూ లేనంతగా వరద నీరు వచ్చి చేరుతోంది.

ప్రకాశం బ్యారేజ్‌(Prakasam Barrege)కు ఎన్నడూ లేనంతగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం వరద ఇన్‌ఫ్లో, ఔట్‌ ఫ్లో 11.43 లక్షల క్యూసెక్కులు దాటింది. దీంతో కరకట్ట (Karakatta)మీదగా నీరు ప్రవహిస్తోంది. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(CM Chandra Babu Naidu) నివాసంలోకి కూడా నీరు వెళ్లింది. నీరు లోపలికి రాకుండా అధికారులు లారీలతో ఇసుక తరలించి అడ్డుపెట్టారు కానీ వరద ప్రవాహాన్ని ఆపలేకపోయారు. చంద్రబాబు ఇంటి లోపలికి చేరిన నీటిని ఆరుకు పైగా మెటార్లను ఉపయోగించి బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరుతున్న ప్రవాహం 9,17,976 క్యూసెక్కులకు చేరడంతో కృష్ణా నది(Krishna River) కరకట్ట లోపల ఉన్న చంద్రబాబు ఇంటిని వరద చుట్టుముట్టింది. ఇందులోనే నారా లోకేశ్‌(Nara Lokesh) గెస్ట్‌ హౌస్‌గా చెప్పుకునే అప్పారావు బంగ్లా కూడా ఉంది. ఇక్కడ కూడా ఇసుక బస్తాలు వేసి వరద నీరు లోపలికి రాకుండా ఆపే ప్రయత్నం చేశారు కానీ వారి వల్ల కాలేదు. ఆదివారం రాత్రి కృష్ణా నది వరద ఉధృతి మరింత పెరుగుతుందని, రాత్రికి అక్కడ ఉంటే ప్రమాదమని చంద్రబాబుకు జలవనరుల శాఖ అధికారులు చెప్పడంతో ఆదివారం రాత్రి విజయవాడలోని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి షిఫ్ట్‌ అయ్యారు చంద్రబాబునాయుడు.

ehatv

ehatv

Next Story