చంద్రబాబును(chandrababu) స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ స్కామ్(skill development Scam) కేసులో సీఐడీ(CID) అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం చంద్రబాబు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో(Rajahmundry central jail) రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

చంద్రబాబును(chandrababu) స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ స్కామ్(skill development Scam) కేసులో సీఐడీ(CID) అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం చంద్రబాబు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో(Rajahmundry central jail) రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయ‌న అరెస్ట్‌పై టీడీపీ శ్రేణులు నిర‌సన వ్య‌క్తం చేస్తున్నారు. హైద్రాబాద్‌లోనూ ఐటీ ఉద్యోగులు(IT Employees) ధ‌ర్నాలు, నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చారు. ఈ క్ర‌మంలోనే పోలీసులు ప‌లు ప్రాంతాల్లో ఆంక్ష‌లు కూడా విధించారు.

ఇదిలావుంటే.. స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు త్వ‌ర‌గా బెయిల్ రావాల‌ని తెలంగాణ సెటిలర్స్ ఫోరమ్(Telangana Settlers Forum) ఆధ్వ‌ర్యంలో మ‌హిళ‌లు బల్కంపేట ఎల్లమ్మ(Balkampet Yellamma) తల్లికి బోనం(Bonam) సమర్పించారు. తెలంగాణ సెటిలర్స్ ఫోరమ్ కన్వీనర్ కాట్రగడ్డ ప్రసూన ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించి.. చంద్రబాబుకు బెయిల్ రావాల‌ని.. ఆయ‌న త్వ‌ర‌గా జైలు నుంచి విడుద‌ల కావాల‌ని ఆకాంక్షించారు.

Updated On 15 Sep 2023 1:55 AM GMT
Ehatv

Ehatv

Next Story