వరదలు బాధితుల‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్ధిక‌సాయం ప్ర‌క‌టించారు. వరధ వల్ల నష్ట పోయిన కుటుంబాల‌ను ఆదుకునేందుకు ప్యాకేజీ వివరాలను ఆయన ప్రకటించారు

వరదలు బాధితుల‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్ధిక‌సాయం ప్ర‌క‌టించారు. వరధ వల్ల నష్ట పోయిన కుటుంబాల‌ను ఆదుకునేందుకు ప్యాకేజీ వివరాలను ఆయన ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవ్వక ముందే ఇంత గొప్ప విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరిగిందన్నారు. వరద విప్తతు నుండి ప్రజలను కాపాడేందుకు తమ ప్రభుత్వం చేసిన అవిరళ కృషిని రాష్ట్రంతో పాటు దేశం మొత్తం గుర్తించిందన్నారు. పలువురు దాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నారని వారందరికీ పేరుపేరునా రాష్ట్ర ప్రభుత్వం తరపున, 5 కోట్ల ప్రజల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

ప్యాకేజీ వివరాలను ఆయన ప్రకటిస్తూ విజయవాడ నగరంలోని 32 వార్డుల్లోని 179 సచివాయాల్లోని వరద బాదితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు పాడైపోయిన గృహాపకరణాల మరమ్మత్తుకు తగు చర్యలు కూడా తీసుకోవడం జరుగుచున్నదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజ్ ప్రకారం 32 వార్డుల్లోని 179 సచివాలయాల పరిధిలో గ్రౌండ్ ప్లోర్ నీటి మునిగిన వాళ్లందరికీ రూ.25 వేల చొప్పున ఆర్థికసాయం అందజేస్తామని.. ఒక ఇంటికి రూ.25 వేలు ఇవ్వడమనేది చరిత్రలో ఇది మొదటిసారన్నారు. ఒకప్పుడు రూ.4 వేల రూపాయలు ఇచ్చిన పరిస్థితి ఉందన్నారు. వరద సమయంలో ఏ ఒక్కరికీ భోజనాల విషయంలో ఏమాత్రము లోటు చేయలేదని.. రాయితీపై కూరగాయలు, 25 కేజీల బియ్యం, ఒక కేజీ పామాయిల్, ఒక కేజీ పంచదార, ఒక కేజీ పప్పు, రెండు కేజీల ఉల్లిపాయలు, రెండుకేజీల పొటాటో ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పుడు ప్రతి ఇంటికి రూ.25 వేల ఆర్థికసాయం చేస్తున్నామన్నారు.

అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్‌, సెకండ్ ఫ్లోర్, ఆపైన అంతుస్తుల్లో ఉండే అందరికీ రూ.10 వేల ఆర్థికసాయం చేస్తామన్నారు. వరదలో నీటమునిగిన ఇతర ప్రాంతాలకు చెందినవారికి కూడా రూ.10 వేలు సాయం అందజేస్తామన్నారు. కిరాణా షాపులు, టీ కొట్లు వంటి షాపులున్న అందరికీ రూ.25 వేల సాయం అందిస్తాజేస్తామన్నారు. అదేమాదిరిగా రిజిస్టర్ చేసుకున్న ఎంఎస్ఎంఈలకు టర్నోవర్ రూ.40 లక్షల కంటే తక్కువ ఉంటే వాళ్లందరూ జీఎస్టీ ఫైల్ చేయాల్సిన పనిలేదని.. జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోనివాళ్లకి రూ.50 వేలు ఇస్తామన్నారు. అదే సమయంలో ఎంఎస్ఎంఈలు రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్లు టర్నోవర్ ఉన్నవాళ్లకి రూ.లక్ష ఇస్తామన్నారు. అదేసమయంలో రూ.1.5 కోట్లు ఆపైన ఉంటే రూ.1.5 లక్షలు ఇస్తామన్నారు. టూవీలర్స్ కు ఇన్సూరెన్స్ క్లెయిమ్, రిపేర్లు చేసుకునేందుకు సహకరిస్తున్నామన్నారు. ఇప్పటివరకు రూ.71.50 కోట్లకు క్లెయిమ్ కు సంబందించి 9,088 వెహికల్స్ క్లెయిమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. వీటిలో 2,345 క్లెయిమ్స్ సెటిల్ అయ్యాయని, రూ.6.21 కోట్లు అందజేయడం జరిగిందన్నారు. 6,748 క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయని.. ఇందుకు రూ.65.29 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story