Actor Suman : ప్రతిపక్షాలు కన్ఫ్యూజన్లో ఉన్నాయి.. మళ్ళీ జగనే సీఎం
ఏపీలో మళ్లీ జగనే సీఎం అని సినీనటుడు సుమన్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు లో శ్రీ చౌడేశ్వరి దేవి సమేత రామలింగేశ్వరి ఆలయంలో సుదర్శన యాగంలో సుమన్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ఏపీలో మళ్ళీ జగనే సీఎం అవుతారని అన్నారు.

Film actor Suman said that Jagan will be CM again in AP
ఏపీ(AP)లో మళ్లీ జగనే(Jagan) సీఎం అని సినీనటుడు సుమన్(Actor Suman) అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా(Konaseema District) అంబాజీపేట(Ambajipeta) మండలం పుల్లేటికుర్రు(Pulletikuru) లో శ్రీ చౌడేశ్వరి దేవి సమేత రామలింగేశ్వరి ఆలయంలో సుదర్శన యాగం(Sudarshana Yagam)లో సుమన్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ఏపీలో మళ్ళీ జగనే సీఎం అవుతారని అన్నారు. ప్రతిపక్షాల పొత్తుల విషయంలో ఇంకా క్లారిటీ లేదని.. సీఎం ఎవరో కూడా తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారని సుమన్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వెనుకబడిన కులాలు జగన్ వెంటే ఉన్నారని పేర్కొన్నారు. జగన్ లా మేనిఫెస్టో(Manifesto) అమలుచేసిన వారు భారతదేశంలో ఎవరు లేరని కొనియాడారు. నవరత్నాలు(Navaratnalu) 95 శాతం అమలు చేశారని పేర్కొన్నారు. కరోనా(Corona) సమయంలో జగన్ చేసిన సాయం ఎవరు మర్చిపోలేదని సుమన్ అన్నారు.
