ఓ యువతి లా(Law) చదువుతోంది. ఓ సహ విద్యార్థి ప్రేమ(Love) పేరుతో ఆమెకు వల వేశాడు.

ఓ యువతి లా(Law) చదువుతోంది. ఓ సహ విద్యార్థి ప్రేమ(Love) పేరుతో ఆమెకు వల వేశాడు. ప్రియురాలితో శారీరకంగా(Physical Relation) కలిశాడు. అంతేకాకుండా తానే నయవంచకుడిగా మారి తన స్నేహితులతో గ్యాంగ్‌ రేప్‌(Gang rape) చేయించాడు. ఆమెతో ఏకంతంగా ఉన్న వీడియోలను చూపించి, బెదిరించి పదేపదే తనపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు(Suicide) ప్రయత్నించింది. ఇది గమనించిన తండ్రి ఆమెను అడ్డుకొని ఏం జరిగిందో చెప్పాలన్నాడు. తండ్రికి జరిగిన విషయం చెప్పడంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

విశాఖ జోన్ 2 ప్రాంతానికి చెందిన లా విద్యార్థిని తన తోటి విద్యార్థితో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే పెళ్లికి ముందే వీరిద్దరూ శారీరకంగా కలిశారు. ఓ సారి దాబాగార్డెన్స్ వద్ద ఉన్న తన ఫ్రెండ్ గదికి తీసుకెళ్లి ఆమెతో శారీరకంగా కలిశాడు. ముందుగా అనుకున్న ప్లాన్‌ ప్రకారం అదే సమయంలో అక్కడికి వచ్చిన ప్రియుడి స్నేహితులు ముగ్గురు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ప్రియుడే దగ్గరుండి తన స్నేహితులతో మూకుమ్మడి అత్యాచారం చేయించడంతో ఆమె తట్టుకోలేక అవమానభారంతో కుంగిపోయింది. ప్రియుడిని గట్టిగా నిలదీయడంతో తన వద్ద ఉన్న వీడియోలతో ఆమెను బ్లాక్ మెయిల్‌ చేయడం ప్రారంభించాడు. వీడియోలు బయటపెడతానని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారు. ప్రియుడు.. కాదు.. కామంధుడి వేధింపులు తట్టుకోలేక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. కూతురును గమనించిన తండ్రిని ఆత్మహత్యను అడ్డుకున్నాడు. ఏం జరిగిందని కూతురును అడగ్గా జరిగిన విషయం చెప్పడంతో గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరం టూటౌన్‌ పీఎస్‌ పరిధిలో జరగడంతో అక్కడ ఫిర్యాదు చేయాలని సూచించగా.. అక్కడి పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. నిందితుల్లో ముగ్గురు లా విద్యార్థులు ఉంటే.. మరో నిందితుడు వరుణ్ మోటర్స్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేపట్టారు.

Eha Tv

Eha Tv

Next Story